తెరపైకి రజనీకాంత్‌ బయోపిక్‌.. సూపర్‌ స్టార్‌ గా నటించే హీరో ఎవరో తెలుసా?.. క్రేజీ అప్‌డేట్..

By Aithagoni RajuFirst Published May 1, 2024, 1:44 PM IST
Highlights

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జీవితంలోపై సినిమా రాబోతుంది. సినిమా స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన జీవితం ఇప్పుడు తెరపైకి ఎక్కబోతుంది. 
 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జీవితం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌. ఆయన ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. సౌత్ ఇండియాలోనే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఎంతో మంది అభిమానులను ఏర్పర్చుకున్నారు. రజనీకి విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమాలు ఇతరదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. జపాన్‌, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్‌ వంటి దేశాల్లోనూ రజనీ సినిమాలు చూస్తారు. 

బస్‌ కండక్టర్‌ స్టేజ్‌ నుంచి తన స్టయిల్‌తో ఆకట్టుకుని సినిమా హీరోగా మారాడు రజనీ. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ తో ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్‌ అయి, ప్రముఖ దర్శకుడు బాల చందర్‌ శిష్యుడిగా రాణించి క్రమంగా సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు రజనీ. మాస్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. డెబ్బై ఏళ్లు దాటినా ఇప్పటికీ హీరోగా కొనసాగడం నేటి స్టార్స్ తో పోటీ పడటం విశేషం. అంతేకాదు తనకు సరైన సినిమా పడితే ఏ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో `జైలర్‌`తో నిరూపించాడు.

 తిరుగులేని స్టయిల్‌, ఇమేజ్‌, మార్కెట్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్‌ జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతుంది. సినిమా స్టార్‌ లైఫ్‌ సినిమాగా రావడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌ మేకర్‌ సాజిద్‌ నడియద్‌వాలా.. రజనీ బయోపిక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. సూపర్‌ స్టార్‌ బయోపిక్‌లో రజనీగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. రజనీకాంత్‌ పాత్రలో నటించడమంటే ఆశామాషీ కాదు, ఆయనస్టయిల్‌ని,మ్యానరిజాన్ని పట్టుకోవాలి. ఆయనలా అచ్చు గుద్దినట్టు దించడం కత్తిమీద సాములాంటిది. పెద్ద సవాల్‌తో కూడుకున్నది. అందులో ఏమాత్రం తేడా వచ్చినా, రజనీకాంత్‌లా ఆడియెన్స్ ఊహించుకోవడం కష్టమవుతుంది.సినిమా ఫలితంపైనే ప్రభావం చూపిస్తుంది. 

EXCLUSIVE: The biopic of Superstar Rajinikanth to be produced by renowned producer Sajid Nadiadwala, the scripting work for the same has begun. More details on cast and crew coming up! pic.twitter.com/0oRt9dDbJR

— LetsCinema (@letscinema)

దీంతో ఇప్పుడు రజనీ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రాథమిక సమాచారం మేరకు రజనీ బయోపిక్‌లో ధనుష్‌ నటిస్తారని అంటున్నారు. ఆయన అయితేనే మామ పాత్రకి న్యాయం చేయగలరని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ధనుష్‌ ఫిజిక్‌ పరంగా సెట్‌ అవుతాడా అనేది డౌట్‌. అలాగే దర్శకుడు ఎవరనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి ఈ రెండు విషయాలపై క్లారిటీ వస్తే రజనీకాంత్‌ బయోపిక్‌పై ఓ స్పష్టత వస్తుందని చెప్పొచ్చు. 

ఇక ప్రస్తుతం రజనీకాంత్‌.. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో `వేట్టయాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో `కూలీ` సినిమాలో నటించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ లు ఆకట్టుకున్నాయి. 
 

click me!