ఎన్టీఆర్‌పై సీనియర్‌ నటుడి ప్రశంసలు.. ఎల్లప్పుడూ స్ఫూర్తినివ్వండి అంటూ తారక్‌ పోస్ట్

By Aithagoni RajuFirst Published May 1, 2024, 1:08 PM IST
Highlights

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ముంబయిలో సందడి చేస్తున్నారు. ఓ వైపు షూటింగ్‌లో బిజీగా ఉంటూనే బాలీవుడ్‌ స్టార్స్ తో పార్టీల్లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు. 
 

ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన హృతిక్‌ రోషన్‌తో కలిసి `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ముంబయిలోనే ఉన్నారు ఎన్టీఆర్‌. గత వారం రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. మరో వారంపాటు ఉండే అవకాశం ఉంది. గతంలో ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌, ఇప్పుడు రెండో షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇందులో ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ వంటి మెయిన్‌ కాస్టింగ్‌ ఉంటుందట. 

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ మధ్య కీలక సన్నివేశాలను, అలాగే ఫైట్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు ఇద్దరి మధ్య ఓ సాంగ్‌ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో `నాటు నాటు` తరహాలోనే ఈ ఇద్దరు ఓ మాస్‌ సాంగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్‌ నడుస్తుంది. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యష్‌ రాజ్‌ఫిల్మ్స్ నిర్మిస్తుంది. స్పై యూనివర్స్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న చిత్రమిది. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ముంబయికి వెళ్లినప్పట్నుంచి పార్టీలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. మొన్న హృతిక్‌ రోషన్‌, రణ్‌ బీర్ కపూర్‌, అలియాభట్‌, కరణ్‌ జోహార్‌ వంటి స్టార్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీటితోపాటు చాలా మంది సీనియర్‌ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌ ప్రాజెక్ట్ లకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్టు టాక్‌. 

ఇదిలా ఉంటే సీనియర్‌ నటుడు అనపమ్‌ ఖేర్‌.. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. గత రాత్రి తాను అభిమానించే నటుల్లో ఒకరిని కలుసుకోవడం ఆనందంగా ఉందని, అతని పనిని ఇష్టపడతానని, అతని శక్తిని పెంచుకుని మరింతగా ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నట్టు అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్‌(ఎక్స్) చేశారు. ఈ మేరకు `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `దోస్తీ` పాటని బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉపయోగించారు. 

దీనికి ఎన్టీఆర్‌ స్పందించారు. అద్భుతమైన పనితనం కలిగిన నటుడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఆయన పనిని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండిసర్‌` అని పేర్కొన్నాడు తారక్‌. ఆయన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తారక్‌ అభిమానులు ఈ పోస్ట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాలీవుడ్‌లో తారక్‌ అన్న దున్నేయాలని అంటున్నారు. 

The joy of running into an actor whose body of work I have always admired is indescribable. May you continue to inspire generations of actors to come sir. https://t.co/qLyiwkSs5P

— Jr NTR (@tarak9999)

ఎన్టీఆర్‌ తెలుగులో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింట్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. కొరటాల శివ సినిమాని మరింతగా చెక్కుతున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసితో ఉన్నారు. ఈ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో దీన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా అయ్యిందని సమాచారం. 
 

click me!