జగన్ పై ప్రతిపక్షాల దాడి.. శ్రీరెడ్డి కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్!

By Udayavani DhuliFirst Published Oct 26, 2018, 12:57 PM IST
Highlights

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై గురువారం నాడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దాడికి దిగిన సంగతి తెలిసిందే. కోళ్ల పందాల కోసం వాడే కత్తితో జగన్ చేతిపై గాయం చేశారు. అయితే ఈ ఘటనను ఖండిస్తూ.. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై గురువారం నాడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దాడికి దిగిన సంగతి తెలిసిందే. కోళ్ల పందాల కోసం వాడే కత్తితో జగన్ చేతిపై గాయం చేశారు. అయితే ఈ ఘటనను ఖండిస్తూ.. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

జగన్ ని అన్న అని పిలుస్తూ సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా పోస్ట్ లు పెట్టే నటి శ్రీరెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ''మా జగన్ అన్నకి ఏం అయ్యింది, రాష్ట్రం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి, దమ్ముంటే దైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని జనం కోసం పోరాడుతున్న జగన్ గారి మీద ఇలా చేయటం తప్పు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా జగన్ అన్నా'' అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.

దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. శ్రీరెడ్డిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. దానికి కారణం శ్రీరెడ్డి తన పోస్ట్ లో ప్రతి పక్షాల దాడి అని చెప్పడమే.. కొందరు నెటిజన్లు  ప్రతిపక్షాల దాడి ఏంటి..? జగన్ ప్రతిపక్షమే కదా.. అంటూ సెటైర్లు వేస్తుండగా.. మరికొందరు ఆమెని తిట్టిపోస్తున్నారు. 

సంబంధిత వార్తలు

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

click me!