'అర్జున్ రెడ్డి' హిందీ టైటిల్ ఇదే!

Published : Oct 26, 2018, 12:42 PM IST
'అర్జున్ రెడ్డి' హిందీ టైటిల్ ఇదే!

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హోదా సంపాదించుకున్నాడు. దర్శకుడు సందీప్ కి జాతీయ స్థాయిలో సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హోదా సంపాదించుకున్నాడు. 

దర్శకుడు సందీప్ కి జాతీయ స్థాయిలో సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తమిళంలో ఈ సినిమా రీమేక్ దాదాపు పూర్తయ్యే స్టేజ్ కి చేరుకుంది. విక్రమ్ కుమార్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. 

దీనికి 'వర్మ' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్, కైరా అద్వానీ నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు సందీప్ ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం.

అదే 'కబీర్ సింగ్'. టైటిల్ పోస్టర్ ని చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' పోస్టరే గుర్తొస్తుంది. వచ్చే ఏడాది జూన్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?