ఆసక్తికరం: హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో తీన్మార్ మల్లన్న

By telugu teamFirst Published Sep 27, 2019, 7:58 AM IST
Highlights

కేసీఆర్ ప్రభుత్వంపై వీడియోల ద్వారా పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. 

హుజూర్ నగర్: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలోని హుజూర్ నగర్ తోపాటు మరో 63 స్థానాలకు కూడా ఉప ఎన్నికల నగారా మోగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే హుజూర్ నగర్ లో తెరాస తమ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి ని ప్రకటించగా కాంగ్రెస్ తమ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించాయి. బీజేపీ తమ అభ్యర్థిగా శ్రీ కళా రెడ్డిని బరిలోకి దింపేందుకు చూస్తోంది. 

ఇప్పటివరకు త్రిముఖ పోరుగానే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉండబోతుంది అనుకుంటున్న తరుణంలో 30మంది లాయర్లు ఈ పోరులో నిలవబోతున్నామంటూ సంచలనం లేపారు. ఈ పోరును మరింత రసవత్తరం చేస్తూ ప్రభుత్వం సర్పంచులను చిన్నచూపు చూస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా 250మంది సర్పంచులు బరిలో నిలవనున్నామని తెలిపారు. హలో సర్పంచ్ చలో హుజూర్ నగర్  పేరిట వారొక నినాదాన్ని కూడా ముందుకు తెచ్చారు. 

ఇప్పుడు ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నికను మరింత రసవత్తరం చేస్తూ తీన్ మార్ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయిన తీన్ మార్ మల్లన్న ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో నిలవనున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిన్న అర్థరాత్రి ప్రకటించాడు. తాను బడుగు బలహీన వర్గానికి చెందిన వాడినని, ఉప ఎన్నికలో గెలిచేంత ఆర్ధిక స్థోమత తనకు లేని కారణంగా ప్రజల నుంచి విరాళాలు అడుగుతున్నానన్నాడు.. 

తీన్ మార్ మల్లన్న గా సుప్రసిద్ధుడైన ఇతని పేరు నవీన్ కుమార్. తొలుత తీన్ మార్ అనే కార్యక్రమాన్ని టీవిలో నిర్వహించేవాడు. ఆలా బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ, యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడు. డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాల వీడియోలే పెట్టాడు. బాతాలా పోశెట్టి పేరిట ఒక యూట్యూబ్ సిరీస్ నే స్టార్ట్ చేసాడు. 

ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు తనకు ప్రజలు సహకరించాలని వేడుకుంటున్నాడు. అందరినీ కనీసం వారుతాగే ఒక ఛాయ్ పైసలనన్నా విరాళంగా ఇవ్వాలని తనకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ ను యూట్యూబ్ లో ఉంచాడు. ప్రచారానికి కూడా ప్రజలను తరలిరావాలని వేడుకుంటున్నాడు. 

నిన్న అర్థరాత్రి పోస్టు చేసినప్పటికీ, ప్రజలు భారీ స్థాయిలో దీనిని చూసారు. ఉదయం 7గంటలకల్లా 32వేలమంది చూశారంటే ఇతనికి ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టు. ప్రతిపక్షాలు తాను బయటపెడుతున్న ప్రభుత్వ భూకుంభకోణాలపై మాట్లాడకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నాయని, అందుకే తానుకూడా ప్రజాక్షేత్రంలోనే అధికార,ప్రతిపక్షాల భారతం పడతానని వేడుకుంటున్నాడు. గతంలో ఇతను కాంగ్రెస్ టికెట్ పై విద్యావంతుల ఎమ్మెల్సీ గా పోటీ చేసి ఓటమి చెందాడు. 

ప్రజలందించే ఒక్క రూపాయి కూడా వృధా చేయనని, తెలంగాణ ప్రజలిచ్చే  ప్రతిరూపాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఖర్చు చేస్తానని తెలుపుతున్నారు. 

కేవలం మూడు పార్టీలమధ్య మూడు ముక్కలాటగా ఉంటుందనుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు లాయర్లు, సర్పంచులు, ఈ నూతన ఎంట్రీ తీన్ మార్ మల్లన్న వంటి వారితో చాలా రసవత్తరంగా మారింది. 

సంబంధిత వార్తలు

ఆసక్తికరం:హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో తీన్మార్ మల్లన్న

ఉప ఎన్నిక: హుజూర్ నగర్ లో మోహరిస్తున్న గులాబీ దళాలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు...

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు..

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

click me!