నాలుగో రోజులుగా హైద్రాబాద్‌ను వీడని వర్షం: చెరువులను తలపిస్తున్న రోడ్లు

By narsimha lodeFirst Published Sep 27, 2019, 7:19 AM IST
Highlights

హైద్రాబాద్ లో  నాలుగు రోజులుగా  వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.


హైదరాబాద్: హైద్రాబాద్ ను వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.నాలుగు రోజులుగా హైద్రాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు.

గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం నాడు తెల్లవారుజామువరకు వర్షం కురిసింది. హైద్రాబాద్ లోని గుడిమల్కాపూర్ లో 15 సెం.మీ. వర్షం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. దీంతో నగరంలో జన జీవనం అతలాకుతలమైంది.

ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతం రోడ్డంతా చెరువును తలపించింది. మియాపూర్, పంజగుట్ట, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైంది.

గురువారం అర్ధరాత్రివరకు నాంపల్లి, బేంగబజార్, మెహిదిపట్నం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు గుడి మల్కాపూర్ ప్రాంతంలో సుమారు 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. రెడ్ హిల్స్ 13.3, ఖైరతాబాద్ లో 12.7 సెం.మీ., మోండా మార్కెట్ లో 10.9 , శ్రీనగర్ కాలనీ 9.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాత్రి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను కోరారు.

click me!