టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

By narsimha lodeFirst Published Apr 11, 2019, 10:23 AM IST
Highlights

: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో మంత్రి భూమా అఖిలప్రియ భర్తకు సోదరికి  గాయాలయ్యాయి.

కర్నూల్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో మంత్రి  అఖిలప్రియ భర్తకు సోదరికి  గాయాలయ్యాయి.

గురువారం నాడు పోలింగ్ సందర్భంగా అహోబిలంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ  చోటు చేసుకొంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నాయి.ఈ  ఘటనలో టీడీపీ అభ్యర్ధి, మంత్రి అఖిలప్రియకు గాయాలయ్యాయి.

గత ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి భూమా అఖిలప్రియ తల్లి భూమా శోభా నాగిరెడ్డి ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రోడ్డు ప్రమాదంలో మరణించినందున ఎన్నికలు వాయిదా పడకుండా ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ స్థానంలో శోభా నాగిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా భూమా అఖిలప్రియ నెగ్గారు.

ఆ తర్వాత పరిణామాల్లో భూమా అఖిలప్రియ టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా గంగుల కుటుంబం నుండి బ్రిజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గంగుల కుటుంబం వైసీపీలో ఉంది.
 

సంబంధిత వార్తలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

 

 

click me!