ఆగస్టు 23న కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని .. అయితే అది ఆత్మహత్యాయత్నమేనని అంబటి ఆరోపించారు. ఆ సమయంలో చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా శివప్రసాద్‌ను పరామర్శించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
కోడెల మరణాన్ని వైసీపీ ప్రభుత్వంపై రుద్ది, రాజకీయ లబ్ధిని పొందాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోడెల మరణించిన నాటి నుంచి బాబు నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. సోమవారం అర్ధరాత్రి సమయంలోనూ మీడియా సమావేశం పెట్టి చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని రాంబాబు మండిపడ్డారు.
రాజకీయ ప్రత్యర్థులుగా కోడెల మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు. ఎన్నో రాజకీయ వివాదాలను ఎదుర్కొని, చివరికి సీబీఐ విచారణకు సైతం ఎదురొడ్డి నిలిచిన కోడెల ఎప్పుడూ బెదరలేదని అంబటి గుర్తుచేశారు.
ఎంతో దూకుడుగా ఉండే శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆశ్చర్యంగా ఉందని.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటన్న దానిపై చర్చ జరగాలని రాంబాబు డిమాండ్ చేశారు.
కోడెల కుటుంబంపై కే ట్యాక్స్ కేసులు పెట్టింది తెలుగుదేశం నేతలేనని అంబటి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యకు ఆయన కుటుంబసభ్యులతో పాటు టీడీపీయే కారణమన్నారు. ఇన్ని కేసులు ఆయనపై పెడితే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నేత సైతం ఎందుకు మాట్లాడలేదని అంబటి ప్రశ్నించారు.
23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగినప్పుడు కానీ, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు పక్షానే కోడెల పనిచేశారని రాంబాబు గుర్తు చేశారు.
ఆగస్టు 23న కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని .. అయితే అది ఆత్మహత్యాయత్నమేనని అంబటి ఆరోపించారు. ఆ సమయంలో చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా శివప్రసాద్‌ను పరామర్శించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఆసుపత్రికి రావాలని జీవీ ఆంజనేయులు, మరో మాజీ మంత్రి కోరితే.. టీడీపీ అధినేత రానని చెప్పారని రాంబాబు తెలిపారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని అంబటి పేర్కొన్నారు.
సత్తెనపల్లిలో రాయపాటి రంగబాబుని ప్రోత్సహించి కోడెలను అణచివేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారని అంబటి రాంబాబు ఆరోపించారు.
విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు
కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా
అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం
నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు
కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం
కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు
రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ
వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ
పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా
నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స
మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్
క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్
కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు
ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్
కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్
ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్
చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి
రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస
డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య