జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా

By Nagaraju penumala  |  First Published Sep 23, 2019, 4:04 PM IST

వ్యయ అంచనా రూ.4,987 కోట్లు కాగా మేఘా కంపెనీ రూ.4,358 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. దాంతో మేఘా కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకున్నట్లైంది. ఈ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్ల మేర ఆదా చేకూరునట్లైంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలను ఇస్తోంది. వైయస్ జగన్ ఆశించినట్లుగానే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో భారీగా డబ్బు ఆదా అవుతుంది. 

పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ 65వ ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదాయం వచ్చినట్లైంది. తాజాగా మరోరివర్స్ టెండరింగ్ లో ఏకంగా రూ.628 కోట్లు ఆదా వచ్చింది. 

Latest Videos

సోమవారం నిర్వహించిన పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రాలను కలిసి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు ఆహ్వానించింది. వ్యవయ అంచనా కంటే 12.60 శాతం కంటే తక్కువకు బిడ్ వేసిన మేఘా సంస్థ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. 

వ్యయ అంచనా రూ.4,987 కోట్లు కాగా మేఘా కంపెనీ రూ.4,358 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. దాంతో మేఘా కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకున్నట్లైంది. ఈ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్ల మేర ఆదా చేకూరునట్లైంది. 

ఇకపోతే దేశ చరిత్రలో ఎల్ 1 సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక వ్యయ అంచనాగా పరిగణలోకి తీసుకుని బిడ్ నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో భాగంగా ప్రస్తుత టెండర్ ను సీఎం వైయస్ జగన్ క్యాన్సిల్ చేశారు.  

అనంతరం సోమవారం రివర్స్ టెండరింగ్ లోభాగంగా టెండర్ కు ఆహ్వానించారు. ఇకపోతే టెండర్ రద్దు చేయడంపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పోలవరం జలవిద్యుత్ టెండర్ రద్దు చేయడంపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. 

నవయుగ కంపెనీ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కోర్టు వివాదం ముగిసిన తర్వాత మేఘా కంపెనీ తమ పనులు చేపట్టనుంది. ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు రూ.686కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

click me!