ఏపీ హైకోర్టు తరలింపు ప్రచారం: అమరావతిలో న్యాయవాదుల ఆందోళన

Siva Kodati |  
Published : Sep 23, 2019, 03:40 PM ISTUpdated : Sep 23, 2019, 03:43 PM IST
ఏపీ హైకోర్టు తరలింపు ప్రచారం: అమరావతిలో న్యాయవాదుల ఆందోళన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలంటూ హైకోర్టు ప్రాంగణం వద్ద సోమవారం ఏపీ హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. హైకోర్టు తరలింపు వార్తలపై తమకు స్పష్టతనివ్వాలంటూ వారు నినాదాలు చేశారు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలంటూ హైకోర్టు ప్రాంగణం వద్ద సోమవారం ఏపీ హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు.

హైకోర్టు తరలింపు వార్తలపై తమకు స్పష్టతనివ్వాలంటూ వారు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా హైకోర్టును కర్నూలుకు తరలించే దిశగా తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో కలకలం రేగింది.

ఆ వెంటనే నేలపాడులోనే ఏపీ హైకోర్టును కొనసాగించాలంటూ పశ్చిమగోదావరి నుంచి నెల్లూరు వరకు గల బార్ ఫెడరేషన్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం గవర్నర్‌కు విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్