వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డి సహా ముగ్గురు అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 28, 2019, 2:43 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎఏస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా గురువారం నాడు  కడప పోలీసులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
 

కడప: మాజీ మంత్రి వైఎఏస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా గురువారం నాడు  కడప పోలీసులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

వివేకానందరెడ్డి ఈ నెల 14వ తేదీ రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర చేసినందుకుగాను ఈ ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు.

వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి, ప్రకాష్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.  వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ప్రెస్‌మీట్ పెట్టకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో  పులివెందుల డీఎస్పీ నాగరాజు ప్రెస్ నోటును విడుదల చేశారు..

బాత్‌రూమ్‌లో ఉన్న డెడ్‌బాడీని బెడ్‌రూమ్‌లోకి తరలించడంతో పాటు ఆధారాలను లేకుండా చేశారని పోలీసులు ఈ ముగ్గురిపై పోలీసులు అనుమానిస్తున్నారు.పులివెందుల డీఎస్పీ నాగరాజు ప్రెస్ నోటు విడుదల చేశారు. ఆధారాలను లేకుండా చేశారు. వంటమనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాష్ ను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

 

 

click me!