వైఎస్ వివేకా హత్య కేసు: హైకోర్టులో ముగిసిన వాదనలు

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 12:32 PM IST
Highlights

ఈ కేసుకు సంబంధించి సిట్ ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. రాష్ట్రప్రభుత్వం ఈ కేసులో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సిట్ దర్యాప్తు వల్ల బాధితులకు న్యాయం జరగదని  పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించనుంది. 

అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

ఈ కేసుకు సంబంధించి సిట్ ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. రాష్ట్రప్రభుత్వం ఈ కేసులో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

సిట్ దర్యాప్తు వల్ల బాధితులకు న్యాయం జరగదని  పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించనుంది. ఏజీ వాదనలు అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

click me!