ఏపీలో మాటల యుద్ధం: బీజేపీ నేతకు టీడీపీ నేత నోటీసులు

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 12:56 PM IST
Highlights

తాను అవినీతి చేశానని విజయబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విజయబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నోటీసులిచ్చినట్లు తెలిపారు. తన నోటీసులపై స్పందంచకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆధారం లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పదు అని హెచ్చరించారు.

అమరావతి: ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకుంటే రూ.5లక్షలు ఇస్తానని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆఫర్ ఇచ్చారు. 

కుటుంబరావు ఆఫర్స్ పై బీజేపీ నేత విజయబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ము ఏం చెయ్యాలో తెలియక ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. విజయబాబు వ్యాఖ్యలపై కుటుంబరావు సీరియస్ కామెంట్స్ చేశారు. తనపై వ్యక్తిగత దూషణలకు విజయబాబు దిగడాన్ని ఖండించారు. 

తాను అవినీతి చేశానని విజయబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విజయబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నోటీసులిచ్చినట్లు తెలిపారు. తన నోటీసులపై స్పందంచకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

ఆధారం లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పదు
 అని హెచ్చరించారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిపాజిట్ తెచ్చుకుంటే రూ.10 లక్షలు ఇస్తానని చెప్పానని ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 

అటు చంద్రబాబు హెలికాఫ్టర్ లో డబ్బు తరలిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. హెలికాఫ్టర్ లో డబ్బు తరలించడం వీలైతే బీజేపీ దేశ వ్యాప్తంగా ఉన్న హెలికాప్టర్లు వాడుతున్నారని గుర్తు చేశారు. డబ్బు తరలించడానికే హెలికాప్టర్లను బిజెపి వాడుతుందా అంటూ నిలదీశారు. 

కన్నా వ్యాఖ్యలు గాలి మాటలు, గాలి వార్తలు అంటూ కొట్టిపారేశారు. అలాంటి గాలి వార్తలతో మాట్లాడొద్దని కన్నాకు సూచించారు. మోదీ దేశ ప్రజలు ఎలా బ్రతకాలో కాకుండా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆలోచించాలని సూచించారు. 

ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్  బీజేపీ చూపిన లెక్కలన్నీ అంకెలగారడీ అన్న వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఒక్కటే రూ.1.40 వేల కోట్లు అప్పు చెయ్యడం చూస్తే ఎంత అవినీతి చేసిందో అర్థమవుతుందన్నారు. ఒక శాఖ ఇంత అప్పు చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ ని ప్రశ్నించే హక్కు లేదన్నారు కుటుంబరావు. 

click me!