మోకాళ్ల నొప్పులని నా కోసం లిఫ్ట్‌నే పెట్టించారు: కోడెలతో అనుబంధంపై కేఈ

By Siva Kodati  |  First Published Sep 18, 2019, 2:46 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అకాల మరణంతో ఆయనతో సుధీర్ఘంగా పనిచేసిన నేతలు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... కోడెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అకాల మరణంతో ఆయనతో సుధీర్ఘంగా పనిచేసిన నేతలు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... కోడెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో వీరిద్దరిది 36 ఏళ్ల స్నేహం.. 1978 నుంచి కేఈ రాజకీయాల్లో ఉన్నారు. 1983లో టీడీపీ నుంచి డోన్ ఎమ్మెల్యేగా కేఈ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో కోడెల నర్సరావుపేట నుంచి శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Latest Videos

undefined

కేఈకి ఉన్న అనుభవం దృష్ట్యా ఎన్టీఆర్ ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించారు. దీంతో శివప్రసాద్ ఆయనను 1985లో పల్నాడుకు తీసుకెళ్లి అక్కడి పరిస్ధితిని వివరించారు.

నర్సరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇద్దరు కలిసి ప్రారంభించారు. అలా కోడెల, కేఈ అనతికాలంలోనే ఆప్తమిత్రులుగా మారిపోయారు.

కోడెల మృతి తనను తీవ్రంగా కలచివేస్తోందని.. ధైర్యశాలి అయిన ఆయన జీవితం ఇలా ముగియడం చాలా బాధాకరమన్నారు. ఇద్దరం కలిసి రాజకీయాల్లో సుధీర్ఘంగా పనిచేశామని, అసెంబ్లీలో తనను ప్రత్యేకంగా గౌరవించేవారని కేఈ గుర్తు చేసుకున్నారు.

ఏడాది క్రితం ఉపముఖ్యమంత్రిగా ఉన్న తనను సత్తెనపల్లికి ఆహ్వానించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారన్నారు.

కోటప్పకొండపై ఏర్పాటు చేసిన పార్కులను ప్రారంభించాలని శివప్రసాద్ పట్టుబట్టారని.. అయితే తనకు మోకాళ్ల నొప్పులని, మెట్లను ఎక్కలేనని చెప్పడంతో తన కోసం ప్రత్యేకంగా లిఫ్టును ఏర్పాటు చేసి కొండపైకి తీసుకెళ్లారని కృష్ణమూర్తి తెలిపారు.

ఆ సంఘటన తన జీవితంలో మరుపురాని అనుభూతన్నారు. అటువంటి ఆప్తుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. కోడెల కుటుంబసభ్యులకు కృష్ణమూర్తి సానుభూతి తెలియజేశారు. 

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!