కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Sep 17, 2019, 6:56 PM IST
Highlights

కోడెల తప్పు చేసి చనిపోలేదని వేధింపులకు గురై చనిపోయారని ఆరోపించారు. కోడెల ఆత్మహత్య ప్రభుత్వ హత్య అంటూ మండిపడ్డారు. కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కోట్లాది రూపాయలు దోచుకుని ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నీచర్ పై కేసులు పెట్టడం శోచనీయమంటూ మండిపడ్డారు.

రూ.43వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగాలున్న వ్యక్తి,11 చార్జిషీట్లలో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి... కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

రూ.43వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగాలున్న వ్యక్తి,11 చార్జిషీట్లలో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి... కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయం. pic.twitter.com/oZG9xwxVVp

— N Chandrababu Naidu (@ncbn)

 

పల్నాటి పులి అని పిలువబడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతకే ఇలాంటి పరిస్థితి తెచ్చారంటే ఇలాంటి ఉన్మాదంతో కూడుకున్న పాలనలో రాష్ట్రం పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎంతమందిని చంపుకుంటూ పోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోడెల తప్పు చేసి చనిపోలేదని వేధింపులకు గురై చనిపోయారని ఆరోపించారు. కోడెల ఆత్మహత్య ప్రభుత్వ హత్య అంటూ మండిపడ్డారు. కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ కుట్ర బయటపడింది: చంద్రబాబు
కోడెల శివప్రసాదరావు మృతదేహాన్ని కడసారి చూసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటూనే 144 సెక్షన్ ఎందుకు పెట్టారని నిలదీశారు. అలాగే సెక్షన్ 30 అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.  

ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటున్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసింది.

— N Chandrababu Naidu (@ncbn)

 

ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అనడం దుర్మార్గమన్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ నిలదీశారు. 

వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసిందంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!