చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

Published : Jun 20, 2019, 01:57 PM ISTUpdated : Jun 20, 2019, 05:31 PM IST
చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

సారాంశం

ఈ నేపథ్యంలో నలుగురు ఎంపీల బాధ్యతను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సాయంత్రం ఈ నలుగురు రాజ్యసభచైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 


న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీకి అనుబంధంగా పయనించాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలైన సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేష్ లు బీజేపీకి అనుబంధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 

బీజేపీతో అనుబంధంగా ఉంటామంటూ ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు. బీజేపీతో అనుబంధంగా ఉండేందుకు వారి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఇకపోతే మిగిలిన ఇద్దరు రాజ్యసభసభ్యులు తోట సీతారామలక్ష్మీ, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ లతో సైతం బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తోట సీతారామలక్ష్మీ బీజేపీలో చేరేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అయిన కనకమేడల రవీంద్రకుమార్ మాత్రం బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. సాయంత్రంలోపు కనకమేడల రవీంద్రకుమార్ ఏదో ఒకనిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో వారిని పార్టీలో చేర్చకునే బాధ్యతను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. 

మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులను సంప్రదించిన తర్వాత బీజేపీలో చేరే రాజ్యసభ సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వారిని బీజేపీకి అనుబంధంగా ఉండేలా చూడాలంటూ వెంకయ్యనాయుడును కోరనున్నట్లు తెలుస్తోంది. 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

PREV
click me!

Recommended Stories

Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu