బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

By narsimha lodeFirst Published Sep 28, 2018, 1:46 PM IST
Highlights

:బాక్సైట్  తవ్వకాల అనుమతులను తామే రద్దు చేశామని....ఎట్టి పరిస్థితుల్లోనూ కూడ అనుమతులు ఇవ్వబోమని ఏసీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 

పాడేరు:బాక్సైట్ తవ్వకాల అనుమతులను తామే రద్దు చేశామని....ఎట్టి పరిస్థితుల్లోనూ కూడ అనుమతులు ఇవ్వబోమని ఏసీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాబు విమర్శలు గుప్పించారు.

శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాడేరులోని కిడారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. 

బాక్సైట్ తవ్వకాలను తాము రద్దు చేసినట్టు చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాలను అనుమతి ఇవ్వబోమన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఆ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో కూడ పోరాటం చేస్తోందని బాబు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడ తమపై ఈ విషయమై ఒత్తిడి తెచ్చినా కూడ తాము బాక్సైట్ తవ్వకాలను అనుమతివ్వబోమని స్పష్టం చేసినట్టు బాబు చెప్పారు.

ఏజెన్సీని అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో కిడారి సర్వేశ్వరరావు నిరంతరం తపించేవాడని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉండడంతో పాటు.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్వేశ్వరరావు నిరంతరం పనిచేసేవాడని బాబు చెప్పారు.

తాను విమానంలో ఉన్న సమయంలోనే సర్వేశ్వరరావును హత్య చేసిన విషయం తనకు తెలిసిందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంపితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.

నాయకులను చంపడం మంచి పద్దతి కాదన్నారు. కిడారి కుటుంబంతో పాటు అరకు నియోజకవర్గాన్ని ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వం కోటి రూపాయాల ఆర్థిక సహాయం కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.

సర్వేశ్వరరావు రెండో కొడుకు గ్రూప్ 1 కింద ఉద్యోగం కల్పిస్తామన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలను పార్టీ తరపున ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. విశాఖలో ఇంటి స్థలం ఇప్పిస్తామని బాబు తెలిపారు. 

ప్రజల కోసం సర్వేశ్వరరావు ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. సర్వేశ్వరరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామని బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!