పవన్ కల్యాణ్ కు ఇదే నా సవాల్: టీడీపి ఎమ్మెల్యే

Published : Sep 28, 2018, 01:09 PM IST
పవన్ కల్యాణ్ కు ఇదే నా సవాల్: టీడీపి ఎమ్మెల్యే

సారాంశం

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు భయం లేదని, ఆయన తనకు 40ఏళ్లుగా స్నేహితుడన్న సంగతి ఈ ప్రాంత వాసులకు తెలుసునని బుజ్జి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. భయపడే తత్వం తన రక్తంలో లేదని అన్నారు.

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు ఏలూరు శాసనసభ్యుడు బడేటీ బుజ్జి కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలను పవన్ కల్యాణ్ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు భయం లేదని, ఆయన తనకు 40ఏళ్లుగా స్నేహితుడన్న సంగతి ఈ ప్రాంత వాసులకు తెలుసునని బుజ్జి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. భయపడే తత్వం తన రక్తంలో లేదని అన్నారు.

స్కూలు భూములు కబ్జా చేసానని పవన్ కల్యాణ్ అంటున్నారని అంటూ ఆధారాలతో సహా నిరూపించగలరా అని ఆయన అడిగారు. ఏలూరులో తన హయాంలో ఎటువంటి పేకాట క్లబ్బులు రాలేదని స్పష్టం చేశారు. ఉన్న ఒక్క టౌన్ హాల్ కొంతమంది పెద్దలు చాలాకాలం క్రితం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 

లోకేష్‌కు శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయని గతంలో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని, ఇప్పటికీ వాటిని నిరూపించలేకపోయారని ఆయన గుర్తు చేశారు. వారి మధ్య సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?