కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

By narsimha lode  |  First Published Sep 16, 2019, 6:04 PM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యతో చంద్రబాబునాయుడు చలించిపోయారు. 


అమరావతి:ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. తాను ఏనాడూ ఇలా మాట్లాడాల్సి వస్తోందని  చంద్రబాబునాయుడు చెప్పారు.

సోమవారం నాడు గుంటూరులోని  టీడీపీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్  రావు చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.ఈ సంర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Latest Videos

డాక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోవడం ఊహించని పరిణామమన్నారు. ఎంత క్షోభకు గురైతే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారో ప్రజలంతా ఆలోచించాలన్నారు.ఎంత క్షోభకు గురైతే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారో ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరారు.

మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు.మూడు నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. కోడెల టైగర్‌గా బతికాడని, భయం ఎరుగని వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. పల్నాడు పులి అని కోడెలను కార్యకర్తలు పిలుచుకొనేవారని ఆయన గుర్తు చేశారు.

జగన్ ప్రభుత్వం అమానవీయంగా ప్రత్యర్థులపై పడుతున్నారని మండిపడ్డారు. కోడెల పోరాటయోధుడని, ఎన్ని సమస్యలు, కేసులు వచ్చినా పోరాడదామని గతంలో తనను కలిసినప్పుడు చెప్పానని అన్నారు. 

ప్రభుత్వం చేస్తోన్న అవమానాలను కోడెల భరించలేకపోయారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విచారణ, దర్యాప్తు పేరుతో వెంటాడి వేధించారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.

 రూపాయికే పేదలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. వైద్య వృత్తిని వదిలి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో చొరవ తీసుకున్న మొదటి వ్యక్తి కోడెల అని చెప్పారు. కోటప్పకొండ అభివృద్ధిలో కోడెల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కోడెల శిప్రసాద్ ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

 

సంబంధిత వార్తలు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!