అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

By Nagaraju penumala  |  First Published Sep 21, 2019, 1:47 PM IST


పోలవరం ప్రాజెక్టులో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి ఒక రివర్స్ టెండరింగ్ లోనే బట్టబయలైందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి ఎంతలా జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. 
 


అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టులో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి ఒక రివర్స్ టెండరింగ్ లోనే బట్టబయలైందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి ఎంతలా జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. 

Latest Videos


పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.50 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కేవలం రూ.300 కోట్ల రూపాయల టెండరింగ్ లోనే ప్రభుత్వానికి రూ.50 కోట్లు ఆదాయం వచ్చిందంటే భవిష్యత్ లో మరిన్ని ప్రాజెక్టుల్లో మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. 

ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు మిగిలుతాయన్నది వాస్తవమన్నారు. రివర్స్ టెండరింగ్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. వాటన్నింటిని తాము పటాపంచెలు చేసినట్లు చెప్పుకొచ్చారు. 

రివర్స్ టెండరింగ్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4.77శాతం ఎక్కువ టెండర్ కి దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఇప్పుడు 15.60 శాతం తక్కువకు కోడ్ చేసి టెండర్ వేసిందన్నారు. 

దేశంలో ఓ విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చెప్పుకొచ్చారు. జగన్ సన్నిహితులకు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 

సీఎం జగన్ అనుకూలమైన వారికి టెండర్ కట్టబెట్టలేదన్నారు. ఎక్కడైనా టెండర్ లెస్ కు వేయించి అనుకూలమైన వారికి కట్టబెడతారా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాని హితవు పలికారు. అసత్య ప్రచారాలు కట్టబెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. 

14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ తిట్టిపోశారు. అదేమన్నా అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకుంటారని మండిపడ్డారు. 

రివర్స్ టెండరింగ్ లో నవయుగ కంపెనీ కూడా పాల్గొన వచ్చునన్నారు. తాము ఆ కంపెనీని బ్యాన్ చేయలేదన్నారు. అర్మత ఉన్న సంస్థలన్నీ కూడా పాల్గొనవచ్చన్నారు. చంద్రబాబుకు సంబంధించిన సంస్థలు కూడా రివర్స్ టెండరింగ్ లో పాల్గొనవచ్చునన్నారు.  

పోలవరం పనులు ఆగిపోయాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అది సరికాదన్నారు. నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పినా చంద్రబాబు ఆయన అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.  

భారీవరద వస్తుంటే పనులు చేయడం సాధ్యమా అని నిలదీశారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటే చంద్రబాబుకు భయం ఎందుకంటూ నిలదీశారు. స్పిల్‌ వే కాఫర్‌ డ్యాం మినహా ఏం కట్టారో చెప్పాలని నిలదీశారు. 

ప్రాజెక్ట్‌ విలువ రూ.55 వేల కోట్లు ఇంకా రూ.32 వేల కోట్ల పనులు చేయాల్సింది ఉందన్నారు. వాస్తవం ఇలా ఉంటే 70 శాతం పని పూర్తయిందని ఎలా చెప్తారని నిలదీశారు. ఇప్పటి వరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు.  

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసేసేకున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రతి పనికి నాలుగు శాతం అధికమే టెండర్లు కేటాయించారని, టెండర్లు ఎవరికి వస్తాయో చంద్రబాబు చెప్తున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు ఏమైనా కలగన్నారా అంటూ నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీని అడ్డుకుని ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కానీ జగన్ ప్రభుత్వం లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగాలపై కూడా చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్యామ్ లన్నీ నిండి పోలాలన్నీ పచ్చగా కనబడుతున్నాయని తెలిపారు.

ఇకనైనా చంద్రబాబు చిల్లర రాజకీయాలు, దోపిడీ రాజకీయాలను కట్టబెట్టాలని లేని పక్షంలో ప్రజలు ఇచ్చిన 23 సీట్లు కాస్త 13అవుతాయో లేక 10కే పరిమితమవుతాయో తేల్చుకోమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

click me!