చంద్రబాబు గారు.. ఇది కరెక్ట్ కాదు. పోలీసు అధికారులు

Published : Sep 21, 2019, 12:22 PM IST
చంద్రబాబు గారు.. ఇది కరెక్ట్ కాదు. పోలీసు అధికారులు

సారాంశం

పోలీసులు పోస్టింగులకోసం ఆశపడి అధికారపక్షం చెప్పినట్టువింటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. 

పోస్టింగులు కోసం కక్కుర్తిపడి అధికారి పార్టీ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని, కర్తవ్య నిర్వహణలో పోస్టింగ్ ఒక భాగమే తప్ప, పోస్టింగుల కోసమే అధికారులు పనిచేయరని ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు. 

నిజాయితీ, పట్టుదల,కర్తవ్య దీక్ష వీటిని పోస్టింగులకు ప్రామాణికంగా వ్యవహరిస్తారు తప్ప పార్టీ చెప్పినట్టు వింటే కాదని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల పోలీసుల మనో ధైర్యం దెబ్బతింటుందని, ఇలా వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు మానుకోవాలని హితవు పలికారు. 

ప్రజల రక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు చట్టాన్ని అనుసరించి పోలీసులు పనిచేస్తారే తప్ప, ఎవరో ఒకరి స్వార్థ ప్రయోజనాలకు కొమ్ము కాయరని వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే