Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజువారి పనులు చేసుకోవడంలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల మధ్య ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పాటు వచ్చే మూడు రోజుల్లో వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఎడతెరిపి లేని వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం.. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
తెలంగాణలో రాగల మూడురోజులు తెేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.