హేతువాది, సామజిక కార్యకర్త అయిన బాబు గోగినేని తెలుగువారికి సుపరిచయమే. చర్చల్లో ఎదుటివారికి చెమటలు పట్టించేలా వాదించడం బాబు గోగినేని స్టైల్.
హేతువాది, సామజిక కార్యకర్త అయిన బాబు గోగినేని తెలుగువారికి సుపరిచయమే. చర్చల్లో ఎదుటివారికి చెమటలు పట్టించేలా వాదించడం బాబు గోగినేని స్టైల్. బాబు గోగినేని.. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 తెలుగు షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. దొంగ బాబాలని, మూఢ నమ్మకాలని ఆధారాలతో సహా బయటపెట్టడం బాబు గోగినేని స్టైల్.
ఇదిలా ఉండగా బాబు గోగినేని తాజాగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. బాబు గోగినేని పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ రాజకీయ సిద్ధాంతాలని సపోర్ట్ చేస్తున్నట్లు ఉన్న ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో ' రాజకీయం అంటే ఓట్ల కోసం కాదు ప్రజల బాగు కోసం అని ప్రజల తరుపున నిలబడి సమస్యలని పరిష్కరిస్తున్న పవన్ కళ్యాణ్ ని మనం ఆహ్వానించాలి అని బాబు గోగినేని చెప్పినట్లుగా రాసి ఉంది.
దీనిపై బాబు గోగినేని స్పందించారు. అది ఫేక్ పోస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నట్లుగా వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్. అందులో నిజం లేదు. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అవి నాకు అర్థం కావు కూడా. నా ఆసక్తి మొత్తం హేతువాదంపైనే అని బాబు గోగినేని అన్నారు.
నా పేరుతో రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫేక్ ప్రచారాలు చేయడం ఆపండి అంటూ బాబు గోగినేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం హ్యూమన్ రైట్స్,సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగాల కల్పన లాంటివి ముఖ్యమైనవి అని చెబుతాను అంతకు మించి రాజకీయాలని పట్టించుకోను అని బాబు గోగినేని అన్నారు.
