పీపీఓడీ, పీసీఓఎస్ కారణంగా బరువు పెరిగారా? అయితే, ఆ బరువును ఇలా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా ఆహారం తీసుకోకపోయినా తాము బరువు ఎందుకు పెరుగుతున్నామా అని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏం చేసినా ఆ బరువు తగ్గడం లేదు అంటే... అది పీసీఓడీ, పీసీఓఎస్ కూడా సమస్య కావచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు ఈ పీసీఓడీ, పీసీఓఎస్ తో బాధపడుతున్నారు. 

పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పిసిఒడి. ఈ మధ్యకాలంలో ప్రతి ఇద్దరిలో ఒక మహిళ బాధపడుతున్నారు. ఇది హార్మోన్ల వ్యాధి. దీనివల్ల మహిళల అండాశయాలు పెద్దగా అవుతాయి. ఈ సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బరువు పెరుగుతారు. ఈ పెరిగిన బరువును తగ్గించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి, మీరు ఏం చేయడం వల్ల తొందరగా బరువు తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

ఇలా చేస్తే అధిక బరువు తగ్గించవచ్చు...


కెఫీన్‌కు బై-బై చెప్పండి
మీకు పిసిఒడి ఉండి, బరువు తగ్గాలని అనుకుంటే, టీ, కాఫీ ఎక్కువగా తీసుకోవడం ఆపేసి, హెర్బల్ టీ తాగడం మొదలుపెట్టండి.

తిన్న తర్వాత నడవండి
తిన్న తర్వాత నడవడం మంచిది. ఇది షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. తిన్న తర్వాత నడవడం ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.

సమతుల్యమైన భోజనం తీసుకోండి
పిసిఒడి సమయంలో బరువు తగ్గడానికి మీరు సమతుల్యమైన భోజనం తీసుకోవాలి. అంతేకాదు మీరు పండ్లు, తాజా కూరగాయలు తినాలి. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

వ్యాయామం చెయ్యండి
పిసిఒడితో బాధపడుతున్న మహిళలు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజు బాగా వ్యాయామం చేయాలి. దీనివల్ల మీ హార్మోన్లు బ్యాలెన్స్‌లో ఉంటాయి, మీ బరువు తొందరగా తగ్గుతుంది.

నిద్ర
బరువు తగ్గించే సమయంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రతిరోజు కనీసం 8 నుంచి 9 గంటల వరకు నిద్రపోతే, మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

ఒత్తిడి
బరువు తగ్గించే సమయంలో మీరు ఏదైనా విషయం గురించి ఒత్తిడి తీసుకుంటే, మీరు సులభంగా బరువు తగ్గలేరు. నిజానికి ఒత్తిడి కార్టిసోల్ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఆకలి పెరిగి మీరు ఎక్కువగా తినడం మొదలుపెడతారు.