Asianet News TeluguAsianet News Telugu

ప్రతి తల్లీ.. కూతురికి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలు ఇవి..!

కూతురు జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోనేలా చేయడం తల్లి చేతుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి.. కూతురికి తల్లి ఏం నేర్పించాలో ఇప్పుడు చూద్దాం..

Lessons Every Mother must teach her Daughter
Author
Hyderabad, First Published Oct 20, 2021, 11:43 AM IST

తల్లీ- కూతుళ్ల బంధం ఎప్పుడైనా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి.. తన సంతోషాన్నైనా, బాధనైనా ముందుగా తల్లికి మాత్రమే చెప్పుకుంటుంది. ఇక.. ఆ అమ్మాయి పెరిగి, పెద్దది అయ్యింది అంటే.. ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు.. పెళ్లి తర్వాత అత్తారింట్లో ఎలా ఉండాలి..? ఇలా ప్రతి విషయాన్ని కూతురికి తల్లి మాత్రమే వివరిస్తుంది. కాగా.. చిన్నప్పటి నుంచే.. ప్రతి ఒక్క తల్లి తమ కూతురికి కొన్ని విషయాలు తెలియజేయాలట. అవేంటో ఓసారి చూద్దాం..

Lessons Every Mother must teach her Daughter

కూతురి జీవితంలో తల్లి పాత్ర ఎప్పుడూ స్పెషల్ గా నే ఉంటుంది. కూతురికి తల్లే రోల్ మోడల్ గా ఉంటుంది. అంతేకాదు.. కూతురిని ధైర్యం, కాన్ఫిడెన్స్ లాంటివి కూడా తల్లే స్వయంగా నేర్పిస్తుంది.

కూతురు జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోనేలా చేయడం తల్లి చేతుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి.. కూతురికి తల్లి ఏం నేర్పించాలో ఇప్పుడు చూద్దాం..

ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉండటం చాలా సహజం. అయితే.. మంచి జరిగినప్పుడు ఆనంద పడటం, ధైర్యం రావడం సహజం. అలాగే.. పడిపోయినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండాలని.. అస్సలు కుంగిపోకూడదనే విషాయన్ని తల్లే.. తమ కూతురికి నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఒక వయసు వచ్చాక.. ఎవరైనా బయట ప్రేమకు ఆకర్షితులౌతూ ఉంటారు. ఆ వయసు ఏంటో మీరు గుర్తించాలి. ఇంట్లో లభించాల్సిన ప్రేమ.. లభించకుంటే.. బయటి ప్రేమల కోసం ఆశగా ఎదరుచూస్తారు. ఎవరైనా కొద్దిగా చనువుగా ఉన్నా.. దానినే ప్రేమ అనుకొని భ్రమలో పడిపోతారు. కాబట్టి.. ఇంట్లో ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. కూతురికి అసలు సిసలైన ప్రేమ అంటే ఏంటో తెలుసేలా చేయాలి. అన్ కండిషన్లల్ ప్రేమ అంటే ఏంటో వివరించాలి.

Also Read: ఒక్కసారి చీటింగ్ చేసిన వారితో మళ్లీ సెక్స్.. ఎలా ఉంటుంది..?

ఇక ప్రతి విషయంలో కూతురికి ఇన్సిపిరేషన్ గా ఉండాలి. ఎలాంటి పనినైనా చేయగలం అనే సత్తా వారిలో ఉందనే ధైర్యం నింపాలి. అన్నింటినీ పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకునేలా చేయాలి.

Lessons Every Mother must teach her Daughter

ఇతరులను అర్థం చేసుకోవడం ఎలానో నేర్పించాలి. దానితోపాటు.. సెల్ఫ్ లవ్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి.. తమను తాము ఎలా ప్రేమించుకోవాలి అనే విషయాన్ని కూడా  నేర్పించాలి. ఇక.. హద్దులు కూడా పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. ఇతరులతో ఎలా ఉండాలి..? ఎలా ఉండకూదడనే విషయాన్ని వివరించాలి.

Also Read:విటమిన్ సీ తీసుకుంటే. పీరియడ్స్ ఆలస్యమౌతాయా..?

ప్రతి ఒక్కరికీ  కొన్ని బాధ్యతలు, బంధాలు ఉంటాయి. కూతురిగా.. తమ అమ్మాయికి ఉన్న బాధ్యతలు ఏంటో.. వాటిని ఎలా పూర్తి చేయాలో కూడా చిన్నతనం నుంచే నేర్పించాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios