తెల్ల జుట్టును కవర్ చేయడానికి కొందరు హెన్నా వాడుతూ ఉంటారు. కేవలం హెన్నా వాడితే అది జుట్టును నల్లగా మార్చదు.
ఈ మధ్యకాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.30 దాటకముందే జుట్టు తెల్లగా మారిపోయి.. వయసు మించిన వారిలా కనిపిస్తున్నారు. దీనిని కవర్ చేసుకోవడానికి అందరూ మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ అన్నీ తెచ్చి పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు. అంతేకాదు.. కెమికల్స్ తో నిండి ఉండే ఈ హెయిర్ డై కారణంగా జుట్టు బాగా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా తెల్ల జుట్టు సహజంగా నల్లగా మార్చేయవచ్చు. దానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం...
తెల్ల జుట్టును కవర్ చేయడానికి కొందరు హెన్నా వాడుతూ ఉంటారు. కేవలం హెన్నా వాడితే అది జుట్టును నల్లగా మార్చదు. వెంట్రుకలను ఎర్రగా మారుస్తుంది. అలా కాకుండా.. ఆ హెన్నా పొడిలో మరో ఆకుల పొడిని కూడా కలిపి రాస్తే.. మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
హెన్నా పొడి లో అరువి ఆకుల పొడి కూడా కలపాలి. అరువి పొడి మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది.ఈ రెండింటినీ కలిపి తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చు. హెన్నా ఆకు పొడి, ఆరువి ఆకు పొడి , త్రిఫల చూర్ణం తీసుకొని, వాటిని టీ డికాషన్‌లో కలిపి రాత్రంతా ఉంచండి. ఉదయం, దానితో కొద్దిగా నిమ్మరసం కలపండి. అర చెంచా లవంగం పొడి కలపండి. ఇవన్నీ బాగా కలిపి మీ జుట్టుకు అప్లై చేయండి. అప్లై చేసే ముందు మీ జుట్టును బాగా కడగాలి. అదేవిధంగా, అప్లై చేసిన తర్వాత, 3-4 గంటల తర్వాత మీ జుట్టును శుభ్రం చేసుకోండి. అంతే, మీ బూడిద జుట్టు నల్లగా ముదురు రంగులో ఉంటుంది. దీన్ని ప్రయత్నించండి.
ఎలాంటి కెమికల్స్ ఇందులో లేవు కాబట్టి.. హెయిర్ డ్యామేజ్ అవుతుందనే భయం లేదు. అయినా సరే, దీనిని వాడే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి అలర్జీ రాకపోతేనే ఈ హెయిర్ ప్యాక్ ప్రయత్నించాలి.
