నందిగ్రామ్ దాడి ఘటనలో మమతా బెనర్జీ భద్రతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీ భద్రతను గాలికొదిలేశారంటూ అధికారులపై ఆరోపణలు వచ్చాయి.
నందిగ్రామ్ దాడి ఘటనలో మమతా బెనర్జీ భద్రతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీ భద్రతను గాలికొదిలేశారంటూ అధికారులపై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో ఆయన విఫలమయ్యారంటూ ఐపీఎస్ అధికారి వివేక్ సహాయ్‌పై చర్యలు తీసుకుంది.
ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా అభియోగాలు నమోదు చేయాలని సూచించింది. మమత కాలికి గాయమైన నేపథ్యంలో నందిగ్రామ్ వెళ్లి పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తూ ఆమె గాయాలపాలయ్యారని ఈసీకి నివేదిక సమర్పించారు.
అయితే ఘటన జరిగేటప్పుడు మమత చుట్టూ భారీగా భద్రతా సిబ్బంది ఉన్నారని, సీఎంకు అతి సమీపంగా జనం తోసుకుంటూ వచ్చినా వారిని నియంత్రించడంలో పోలీసులు, భద్రత సిబ్బంది విఫలమయ్యారని నివేదికలో ప్రస్తావించారు. దీని ఆధారంగా ఈసీ చర్యలు చేపట్టింది.
Also Read:మమతపై ఏ దాడి జరగలేదు: ఈసీకి బెంగాల్ సీఎస్ నివేదిక.. తుస్సుమన్న దీదీ వాదన
సహాయ్‌తో పాటు పుర్బి మేదినీపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్‌ను సైతం ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మమతకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది.
అలాగే, తూర్పు మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విభు గోయల్‌ను బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతలను అప్పగించింది. పంజాబ్ మాజీ డీజీపీ (ఇంటిలిజెన్స్) అనిల్ కుమార్ శర్మను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
