విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా వార్డు వాలంటీర్‌ను జర్నలిస్టు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నంలోని 22వ వార్డుకు వాలంటీర్‌గా రెడ్డి దేవి అనే మహిళ పనిచేస్తోంది.

Also Read:అమరావతి రాజధానా..? గ్రామమా: మరోసారి పెద్దిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె అప్పటి నుంచి విడిగా ఉంటోంది. ఈ క్రమంలో రెడ్డి దేవికి ఓ టీవీ ఛానెల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోన్న మురళీ అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో దేవి, మురళీలు పెదబొడ్డేపల్లిలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేవిపై మురళీకి అనుమానం ప్రారంభమైంది. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

Also Read:చెప్పినా వినలేదు, వైసీపీకి ఓట్లేసి కుంపటి పెట్టుకొన్నారు: చంద్రబాబు

ఈ క్రమంలో బుధవారం దేవి తలపై ఇనుపరాడ్డుతో మోదీన మురళీ దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.