చెప్పినా వినలేదు, వైసీపీకి ఓట్లేసి కుంపటి పెట్టుకొన్నారు: చంద్రబాబు
చంద్రబాబునాయుడు అమరావతి రైతులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వద్దంటే వైసీపీకి ఓట్లేసి కుంపటి పెట్టుకొన్నారన్నారు.
అమరావతి: వైసీపీకి ఓట్లు వేసి గెలిపించి, రాష్ట్రంలో కుంపటి పెట్టుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాజధాని పరిసర గ్రామాల్లో చంద్రబాబునాయుడు బుధవారం నాడు తన సతీమణి భువనేశ్వరీతో కలిసి ఆయన పాల్గొన్నారు.
Also read:మీ తర్వాతే మమ్మల్ని పట్టించుకొంటారు: బాాబుపై భువనేశ్వరి
ఈ సందర్భంగా ఎర్రబాలెం, తుళ్లూరు తదితర గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజా వేదికను కూల్చితే మీరు మనకెందుకులే అనుకొన్నారని చంద్రబాబునాయడు రాజధాని రైతుల గురించి వ్యాఖ్యానించారు.
నా ఇల్లును ముంచే ప్రయత్నం చేస్తే చంద్రబాబు స్వంత గొడవ అనుకొన్నారని చెప్పారు. ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి మీకు ఆందోళన మొదలైందన్నారు. వద్దు వద్దు అంటే ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇచ్చారని చంద్రబాబునాయుడు చెప్పారు.
తాను వద్దు వద్దు అంటే ఒక్కసారిగా జగన్‌కు అవకాశం ఇచ్చారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు మీరు పోరాటం చేయండని నన్ను అడుగుతున్నారని చంద్రబాబు రైతులను ఉద్దేశించి చెప్పారు.
రాష్ట్రం మొత్తం నాశనం అవుతోందని మొత్తుకొన్నా కూడ వినలేదన్నారు. కరెంట్ తీగను పట్టుకోవద్దు అంటే వినలేదని ఎన్నికల ప్రచారంలో తాను చేసిన ప్రసంగం అంశాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.
వైసీపీకి ఓట్లు వేసి రాష్ట్రంలో కుంపటి పెట్టుకొన్నారని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తప్పు మీరు చేసి మీరు నన్ను పోరాటం చేయమంటున్నారని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ అంటే జగన్ కు భయమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాకుండా రోడ్లపై ముళ్ల కంచెలు వేశారా అని ఆయన ప్రశ్నించారు. మీరు ఓట్లు వేస్తారని రాజధానిని అభివృద్ది చేయలేదని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.