విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంభిస్తే మంచిదని మాజీ మంత్రి, టిడిపి నాయకులు గంటా శ్రీనివాసరావు సూచించారు. విశాఖ ప్రాచీన  వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆ క్లబ్ తో నగర ప్రజలకు కాదు దేశ  విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి  మంచి అనుబంధం వుందని... దీన్ని దృష్టిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. 

వైజాగ్ కి పురాతనం నుండి పిలుచుకునే వాల్తేరు అనే పేరుతో 1883లో ప్రారంభం అయినప్పటి నుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైందన్నారు. ఇది వైజాగ్ బ్రాండ్ లో భాగమైందని మాజీ మంత్రి పేర్కొన్నారు.  

read more  రాజధాని ఉంటే అమరావతిలోనే... తరలిస్తే అక్కడికే...: అఖిలప్రియ

అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో దీనితో విశాఖ వాసులకు విడదీయరాని అనుబంధం పెరిగిందన్నారు. ఇందులో ఎందరో విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, దేశభక్తులు, వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారని గంటా తెలిపారు.

సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దీనిని యధాతధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే మంచిదని సూచించారు.  వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని... ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి కృషి చేస్తుందని విశ్వసిస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 

read more  420 సెక్షన్ కింద విచారణ... ఏమిటీ జగన్మాయ...: చంద్రబాబు ఆగ్రహం