మిలీనియం టవర్స్ ఖాళీ చేయించడంపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలను తరలిపోయేలా చేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 

buggana rajendranath reddy clarify about millennium Towers issue

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ నుండి పరిశ్రమలు తరలిపోయేలా ప్రభుత్వం పాలన సాగిస్తోందంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరిస్తోందంటూ వారు సోషల్ మీడియాతో పాటు ఇతర మాద్యమాల ద్వారా చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఇప్పటివరకు ఒక్క కియా మోటార్స్ పైనే ప్రచారం సాగించగా ఇప్పుడు ఇతర పరిశ్రమలను కూడా తాము బెదిరిస్తున్నామంటూ ఆధారాలు లేకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని బుగ్గన మండిపడ్డాడు. 

విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఓ ఐటీ సంస్థను ప్రభుత్వం అదేశించినట్టుగా ప్రచారం జరుగుతోందని... అదంతా అబద్దమని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసే తనకు తెలిసిందన్నారు. ఇలా ప్రభుత్వంపై బురదజల్లే కార్యాక్రమాన్ని కొందరు పనిగా పెట్టుకున్నారని బుగ్గన మండిపడ్డారు. 

సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. మిలీనియం టవర్స్ లోని ఐటీ సంస్ధతో ప్రభుత్వం నుండి ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు అందలేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని నియంత్రణ చేయాల్సి ఉందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి హెచ్చరించారు. 

read more  కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

2019 వరకు పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని... గతంలో వచ్చిన పెట్టుబడుల క్రెడిట్ తీసుకోవాలని కూడా తాము భావించటం లేదన్నారు. అలాగని పరిశ్రమలు తీసుకువచ్చామని తాము ప్రచారం చేసుకోవటం లేదన్నారు. 

జూన్ 2019 నుంచి రాష్ట్రానికి రూ.15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. టీడీపీ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగ్ లో పెట్టారని...దాదాపు  3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని ఇప్పుడు తమ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు.  

నిధులు ఉన్నాయో లేదో చూడకుండా, ఆర్ధిక శాఖ ఆమోదం లేకుండా గత ప్రభుత్వం లక్షల కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు? అని ప్రశ్నించారు. పసుపు కుంకుమ కోసం 
పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చారని అన్నారు. 

read more  బెంబేలెత్తుతున్నారు: కియా తరలింపు వార్తలపై చంద్రబాబు వ్యాఖ్య

గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల రూపాయలను బిల్లులు పెండింగ్ పెట్టారని బుగ్గన వెల్లడించారు. కరెంటు కంపనీలకు, ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ  బకాయిలు చెల్లించలేదని అన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తాము కడుతున్నామని...జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వ హయాంలో పెరిగాయని బుగ్గన తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios