Asianet News TeluguAsianet News Telugu

కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

కియా ఫ్యాక్టరీ  ఏపీ నుండి తరలిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. 

Ap minister Buggana Rajendranath Reddy reacts on Kia factory issue
Author
Amaravathi, First Published Feb 6, 2020, 1:43 PM IST


అమరావతి: కియా పరిశ్రమ ఏపీ రాష్ట్రం నుండి ఎక్కడికీ తరలిపోవడం లేదని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  స్పష్టం చేశారు. కియా పరిశ్రమ తరలిపోతోందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

గురువారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ్యపూర్వకంగా కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వివరించారు.ఏపీ రాష్ట్రం నుండి కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.  కియా కార్ల ఫ్యాక్టరీని ఏపీ రాష్ట్రం నుండి తరలిపోతోందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మంత్రి చెప్పారు. 

Also read:లోకసభలో కియా మోటార్స్ ఇష్యూ: రామ్మోహన్ నాయుడ్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్

టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.  ఈ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహయం అందిస్తున్నామని ఆయన చెప్పారు.

కియా ఫ్యాక్టరీ ఏపీ నుండి తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతోందనే వార్తలను ఆ సంస్థే ఖండించిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. కియా పరిశ్రమ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios