విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికే ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు మరింత ఎక్కువ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం(డిసెంబర్ 27వ తేదీన) జరిగే కేబినెట్ భేటీతో  తేల్చాల్సిన రాజధాని అంశంపై విజయసాయి రెడ్డి ముందే ఎందుకు స్పందిస్తున్నారని అన్నారు. 

టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమ, మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ, మాజీ విప్ కూన రవికుమార్ లు అడిగిన ప్రశ్నలకు విజయసాయి సమాధానం చెప్పాలన్నారు. అమరావతి విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసిపి ఎంపీ దానిపై సిబిఐ విచారణకి సిద్దమా అని సవాల్ విసిరారు. 

read more  వారంరోజుల్లో ఆ పని పూర్తిచేయాలి: అధికారులకు జగన్ ఆదేశం

''క్రిస్టియన్ మిషనరీ సంస్ద భూమిని ఢిల్లీలో అనీల్ కుమార్ తో కలిసి ఫైనలైజ్ చేయలేదా. మీ ఆడిటర్ జీవీ పేరు మీద వుంటే మీ పేరుమీద వున్నట్లు కాదా..కార్తీకవనంలో భూమిని రేయాన్స్ హోటల్ కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో మీ పాత్రలేదా...లులూ వెనక్కి పంపించడానికి కారణం మీరు కాదా...నీలకుండీల దగ్గర వెంకటపతి రాజుకు, కేవీపీ కి మధ్యవున్న స్ధల వివాదం మీద లబ్ది పొందాలని చూడటం లేదా'' అని ప్రశ్నించారు. 

''ఆశీల మెట్టమీద వున్న క్రిస్టియన్ మిషనరీ స్దలంలో భాగస్వాములు ఎవరున్నారు.  భవిష్యత్తులో మీరు అక్కడ నిర్మించబోయే అతిపెద్ద హోటల్ ఎవరి పేరు మీద రాబోతోంది. ముదపాక ల్యాండ్ పూలింగ్ లో తమను తప్పుపట్టి మళ్లీ మీరు ఎందుకు మొదలు పెట్టారు.

ముదపాక వెళ్లి ఎందుకు అధికారులతో సర్వే  చేయించారు.పెందుర్తి ఎమ్మార్వోతో ముదపాకలో ఎందుకు సర్వే చేయించారు. ల్యాండ్ పూలింగ్ కు మళ్లీ ఎందుకు జీవో తీసుకు వచ్చారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ మీరు చేయడంలేదా'' అంటూ బండారు  ప్రశ్నించారు. 

read more  అమరావతి ఉద్యమంలో విషాదం... నడిరోడ్డుపైనే బాధిత రైతు ఆత్మహత్యాయత్నం

పరవాడలో మూడు కార్లలో కడప నుంచి కొత్తవ్యక్తులు దిగారని అన్నారు. గత వారం రోజుల్లో విశాఖకు ఎంతోమంది కడప వ్యక్తులు దిగారని... వారు ఎందుకు దిగారో చెప్పాలన్నారు. వీరంతా ఇక్కడ ఎందుకు దిగారో తేల్చాలని బండారు డిమాండ్ చేశారు.