అమరావతి: అర్హత కలిగిని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లపట్టాలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో ప్రకటించినట్లుగా ఉగాది నాటికి ఇళ్లస్థలాలను గుర్తించి పంపిణీకి సిద్దం చేయాలని మంత్రి సూచించారు.  

జిల్లాలవారీగా ఇళ్ల స్థలాల పంపిణీ, లబ్ధిదారుల సంఖ్య, గుర్తించిన స్థలాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, చీఫ్ సెక్రటరీ నీలం సహానీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

read more  ఉరిశిక్షకైనా సిద్దమే... కానీ వారికి అన్యాయం జరిగితే మాత్రం...: ధూళిపాళ్ల నరేంద్ర

ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్లపట్టాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. ఈ జిల్లాలో ప్రభుత్వ స్ధలాలు తక్కువగా వుండటం వల్ల సేకరణలో ఇబ్బందులు తలెత్తున్నట్లు అధికారులు వివరించారు. అయితే వారంరోజుల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు మార్కింగ్‌ చేసి ఇంటిపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని సీఎం సూచించారు. పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌తో రూపొందించాలని ఆదేశించారు. 
దీనికి సంబంధించి పలురకాల నమూనా పత్రాలను అధికారులు  సీఎంకు చూపించారు.  

read more  రేపే ఏపి మంత్రివర్గ సమావేశం...ఇంకా వేదికపై కొనసాగుతున్న సస్పెన్స్

అర్హత ఉండి ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలం ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకూ 22,46,139 లబ్ధిదారులను గుర్తించినట్లు అందులో గ్రామీణ ప్రాంతాల్లో 11,77,260 లబ్ధిదారులు, పట్ణణ ప్రాంతాల్లో 10,99,160 లబ్ధిదారులను గుర్తించగా  22,461 భూములు అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు.