విజయసాయి రెడ్డి వియ్యంకుడి ద్వారా విశాఖ కుంభకోణం... ఆధారాలివే: అనురాధ
విశాఖలో రాజధాని పేరుతో జగన్ మరో పెద్ద కుంభకోణానికి తెరతీశారని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎంపీ విజయసాయి వియ్యంకుడి ద్వారా భూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
అమరావతి: ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖను కబ్జా చేయడానికే వైసీపీ ప్రయత్నం చేస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఓ దొంగ ముఖ్యమంత్రి అయితే పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చిందంటూ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఒక కబ్జా కుటుంబమని రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం జగన్ బినామీలే రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా ఉన్నారని ప్రజలందరికి తెలుసని అన్నారు. ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యహరిస్తోందని చెప్పడంలో ఏమాత్రం ఆతిశయోత్తి లేదన్నారు.
ఆర్టీసీ చార్జీలు గురించి ఎవరు మాట్లాడకుండా రాజధాని విషయం ముందుకు తీసుకు వచ్చారన్నారు. ఇలా ఉల్లిపాయల కొరత గురించి మాట్లాడకుండా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు తన కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి 3రాజధానులంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
అంతర్జాతీయంగా పోలీసులు జగన్ కుంభకోణాల వెంటపడ్డారని... ఈ కేసులో ఇప్పటికే ఆయన మిత్రులు ఇతర దేశాలల్లో గృహా నిర్భందంలో ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం ప్రజలకు తెలియకుండా వుండాలనే 3 రాజధానులు విషయం తీసుకు వచ్చారన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఉత్తరాంధ్రను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు చేయడమే కాకుండా రిజల్డ్ కూడా తీసుకువచ్చారన్నారు. మిలినియం టవర్, వివిధ సాప్ట్‌వేరు కంపెనీలు, ఆదానీ గ్రూప్, లులు గ్రూప్ లను విశాఖకు తీసుకువచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పించచడమే కాదు ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారని అన్నారు.
కానీ వైసిపి ప్రభుత్వం ఆదాని గ్రూప్‌ను వెళ్లగొట్టి రూ.70వేల కోట్లు పెట్టుబడులు రాకుండా చేశారని ఆరోపించారు. లులు గ్రూప్‌ను వెళ్లగొట్టి మరో రూ. 10లక్షల ఉద్యోగాలు రాకుండా చేశారని ఆరోపించారు.
read more రాజధాని వివాదం... జగన్ తో కాదు నేరుగా ప్రధాని మోదీతోనే: నాదెండ్ల
రాజశేఖర్‌రెడ్డి సమయంలో ఉడా డిపార్డుమెంట్ నుంచి ప్రభుత్వం భూములు రూ.2 వేల కోట్లుకు అమ్ముకుందని గుర్తుచేశారు. ఇలా వచ్చిన డబ్బులకు ప్రభుత్వం తరపున ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్టకలేదని...దీంతో ఉడాపై ఇన్‌కమ్ ట్యాక్స్ కేసు నమోదయ్యిందని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆ కేసు కోర్టుల్లో నడుస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ బీనామీ అయిన విజయసాయిరెడ్డి తన వియ్యంకుడి ఫార్మా కంపెనీ ద్వారా విశాఖలో ఎన్ని ఎకరాలు పొందారో తమ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయన్నారు. ఈ రోజు క్యాపిటల్ పేరుతో ఆర్థిక రాజధాని వైజాగ్‌ను తూట్లు పొడవడమే కాకుండా 6వేల ఎకరాల వరకు ఇన్‌సైడ్ ట్రెడింగ్ జరిగిందని... దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
రాజశేఖర్‌రెడ్డి వల్ల ప్రభుత్వం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎన్ని అప్పజెప్పారో కాగ్ రిపోర్టు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. కడపలో సున్నపురాయి వల్ల ఎన్ని వేల కోట్లు మింగేశారో.. లేపాక్షిలో ఎన్నివేల ఎకరాలు మింగేశారో.... ఆ భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి ఎంత లోన్ల్ తీసుకున్నారో తెలుసన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ భూములు, వైజాగ్‌లో రాంకీ భూములు కబ్జా చేసి జగన్ శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
విజయసాయిరెడ్డి వలన రాజశేఖర్‌రెడ్డి కోర్టు మెట్లు ఎక్కిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైజాగ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో అషాడమాసంలో ఆఫర్‌లు పెట్టినట్లు విశాఖకు పులివెందుల పంచాయితీ..రౌడియిజం..కబ్జాలు..దందాలు ఆఫర్ల్‌గా ఇచ్చారన్నారు. అసైన్డ్ భూములు దోచుకోవడం మంచిదికాదు..తిరిగి ఇవ్వమని చంద్రబాబునాయుడు ఆనాడే రాజశేఖర్‌రెడ్డికి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు.
read more జగన్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్... రూ.1400 కోట్లు చెల్లించాలని ఆదేశం
అసైన్డ్ భూములను షర్మిల, రాజారెడ్డి, వివేకానందరెడ్డి పేరు మీద ఇడుపుపాయలో దాదాపు 650 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. వారి పేరు మీద ఉన్న అసైన్డ్ భూము కథ ఏంటి? దీనికి సమాధానం వైసీపీ నాయకులు చెప్పాలన్నారు.
ఆంధ్రరాష్ట్రం విడిపోయిన దాని కంటే విశాఖలో విజయమ్మ గెలిస్తే అంత కంటే ప్రమాదమని సబ్బం హరి ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖను కేవలం 15రోజుల్లో పూర్వస్థాయికి తీసుకువచ్చారని అన్నారు.
''తెలంగాణకు సంపదను పెంచడానికి ముఖ్యమంత్రి అయ్యావా..? లేదా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి అయ్యావా..? కేటిఆర్ మీడియా సమావేశంలో తెలంగాణకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పడం జరిగింది. పెట్టుబడులు తెలంగాణకు పోతుంటే సిగ్గులేకుండా చూస్తున్నారు. దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 7నెలల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.'' అంటూ అనురాధ మండిపడ్డారు.