జగన్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్... రూ.1400 కోట్లు చెల్లించాలని ఆదేశం

విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. దీంతో వెంటనే మద్యంతర ఉత్తర్వులు జారీ చేసి భారీమొత్తంలో నగదు చెల్లించాల్సిందిగా న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

ap highcourt serious on jagan's government

అమరావతి: కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసింది. 

ఏపి విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే. మహేశ్వరి, జస్టిస్ వెంకట రమణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో ప్రభుత్వం కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు పేర్కొన్నారు. వెంటనే పాతబకాయిల కింద పీపీఏలకు రూ.1400 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios