Asianet News TeluguAsianet News Telugu

దారుణం : 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగాలు హుష్ కాకి.. జూమ్ కాల్ లో ఓ సంస్థ నిర్వాకం...

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ తనఖా సంస్థ మూడు నిమిషాల ‘జూమ్’కాల్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల మంది ఉద్యోగులను ఒక్కపెట్టున తొలగించింది. అంతేకాదు, ఉద్యోగుల తొలగింపునకు ముందు పాటించాల్సిన ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. జూమ్ కాల్ కు హాజరయ్యే వరకు ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అన్న సంగతి తెలియకపోవడం గమనార్హం. 

better dot com ceo vishal garg fires 900 employees over zoom call in 3 mins
Author
Hyderabad, First Published Dec 7, 2021, 9:30 AM IST

న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘జూమ్’ బాగా పాపులర్ అయింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులతో సమావేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు Zoom Video calls బాగా అక్కరకు వచ్చాయి. కార్పొరేట్ నుంచి అన్ని సంస్థలు దీన్ని సద్వినియోగం చేసుకున్నాయి.  అయితే ఈ ‘జూమ్’ కాల్ మీటింగ్ లో కొన్ని చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి.

ఎంతగా అంటే.. రాజకీయనాయకుల దగ్గరినుంచి మామూలు ఉద్యోగుల వరకు ఆ వీడియో కాల్స్ కు పట్టిబడిపోయారు. ఒకరు స్నానం చేస్తూ, మరొకరు ప్రియురాలికి ముద్దులిస్తూ.. ఇంకొకరు బట్టలు మార్చుకుంటూ.. ఇలా రకరకాలుగా వారి అసలు స్వరూపాన్ని జూమ్ కాల్స్ బయటపెట్టాయి. ఇప్పటికీ జూమ్ వర్క్ ఫ్రం హోం చేస్తున్న అనేక సంస్థల ఉద్యోగులను కలిపే ఒక మాధ్యమంగా విజయవంతంగా పనిచేస్తూనే ఉంది. 

డిసెంబర్ 25న ప్రపంచంలో మార్పులు జరుగుతాయట.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..

తాజాగా,  అమెరికాలోని New York కు చెందిన ఓ తనఖా సంస్థ మూడు నిమిషాల ‘జూమ్’కాల్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల మంది employeesను ఒక్కపెట్టున తొలగించింది. అంతేకాదు, ఉద్యోగుల తొలగింపునకు ముందు పాటించాల్సిన ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. జూమ్ కాల్ కు హాజరయ్యే వరకు ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అన్న సంగతి తెలియకపోవడం గమనార్హం. 

Pink slip అందుకున్న ఓ ఉద్యోగి ఆ షార్ట్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. Better.com సీఈవో  విశాల్ గార్గ్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఇది మీరు వినాల్సిన వార్త కాదని చెబుతూనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పి అందరికీ ఒకేసారి షాకిచ్చారు. మీరు ‘ అన్ లక్కీ గ్రూప్’ లో ఉన్నారని పేర్కొంటూ అందరికీ Lay off ఇస్తున్నట్లు చెప్పి బాంబు పేల్చారు. 

పాములను వెళ్లగొట్టాలని ఇంటినే తగులబెట్టాడు.. మండుతున్న ఇంటి ఫొటోలు వైరల్

అంతేకాదు, ఈ క్షణం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. ‘నేనేమీ గొప్ప వార్తని మోసుకు రాలేదు.  మార్కెట్ లో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనుగడ సాధించేందుకు మేమైతే ముందుకెళ్లాలి. అలా అయితే అభివృద్ధి చెంది మా మిషన్ ను కొనసాగించగలుగుతాం.. అని Vishal Garg చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. నిజానికి ఇలా చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, ఇలా చేయడం ఇది రెండోసారి అని గార్గ్ పేర్కొన్నారు.  గతంలో ఇలా ఉద్యోగులను తొలగించినప్పుడు ఏడ్చేశాను అని గుర్తు చేసుకున్నారు. 

తమను తొలగించినందుకు ఏడ్వాలో.. సీఈవో కన్నీరు చూసి ఊరట పడాలో అర్థం కాక.. మరుక్షణంలో తాము రోడ్డు మీదున్నమనే పరిస్థితిని తలుచుకుని.. అప్పటికప్పుడు తమకు మళ్లీ ఉద్యోగాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా దొరుకుతాయో తెలియక ఆ ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios