Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 25న ప్రపంచంలో మార్పులు జరుగుతాయట.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..

డిసెంబర్ 25వ తేదీన మానవాళికి ఏదో శక్తి రాబోతోందని, అది మానవ జీవితాలపై చాలా ప్రభావం చూపుతుందని తెలిపే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Changes in the world on December 25 .. Post going viral on social media ..
Author
Hyderabad, First Published Dec 6, 2021, 9:07 PM IST

‘డిసెంబర్ 25న ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతాయి. అది మనుషుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టిక్ టాక్‌లో 5 ఎంటీటీ అనే ఓ యూస‌ర్ ఉన్నాడు. అత‌డికి ఒక మిలియ‌న్‌కు పైనే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అత‌డే ఈ పోస్ట్ చేశాడు. అందులో చాలా ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు. 

ట్రెండింగ్‌లో టైం ట్రావెలింగ్‌..
ప్ర‌స్తుతం టైం ట్రావెల్ ట్రెండింగ్ న‌డుస్తోంది. అస‌లు నిజంగానే టైం ట్రావెల్ చేయ‌వ‌చ్చా ? ఇది సాధార‌ణ మానవుల‌కు సాధ్య‌మేనా అనే ప్ర‌శ్న‌లు ఇటీవ‌ల యూత్‌ను బాగా వెంటాడుతున్నాయి. ఇటీవ‌ల టైం ట్రావెల్‌కు సంబంధించి వ‌చ్చిన సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఐదేళ్లు తేడాతో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ కాల్స్ మాట్లాడుకునే అంశంపై వ‌చ్చిన ‘అద్భుతం’ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇందులో టైం ట్రావెలింగ్ సాధ్య‌మే అని మ‌న‌ల్ని ఒప్పిస్తాడు ఆ డైరెక్ట‌ర్. అలాగే అప్పుడెప్పుడు వ‌చ్చిన బాల‌క్రిష్ణ సినిమా 369లో కూడా టైం ట్రావెలింగ్ గురించి ఉంటుంది. అందులో హీరో హీరోయిన్ ఓ కానిస్టేబుల్ శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌ల కాలంలోకి వెళ్తారు. త‌రువాత భ‌విష్య‌త్ కాలానికి వెళ్తారు. ఇలా మూడు కాలాల్లో ఉండే ఈ సినిమా కూడా బాగా హిట్ అయ్యింది. ఈ ఏడాదిలో వచ్చిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’ లో కూడా టైం ట్రావెలింగ్ ఉంది. అలాగే సూర్య సినిమా ‘24’, కాజల్ నటించిన‌ ‘అ’ కూడా టైం ట్రావెలింగ్ సాధ్యమే అని చెబుతున్నాయి. అలాగే ఈ ఏడాది మధ్యలో వచ్చిన ‘ప్లే బ్యాక్’ అనే సినిమా కూడా ఈ టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చినదే. అయితే ఈ సినిమా ప్ర‌భావ‌మో మ‌రేంటో తెలియ‌దు కాని ఇప్ప‌డు యూత్ చాలా మంది టైం ట్రావెలింగ్ గురించి నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. త‌మ‌కు కూడా టైం ట్రావెల్ చేసే శ‌క్తి వ‌స్తే బాగున్ను అని అనుకుంటున్నారు. అందుకే అలాంటి సినిమాలు ఎన్ని వ‌చ్చిన ఆస‌క్తిగా చూస్తున్నారు. 

https://telugu.asianetnews.com/international/man-burned-down-house-while-trying-to-smoke-out-snakes-r3p2sm
అయితే కొన్ని నెల‌ల కింద‌ట ఓ వ్య‌క్తి టిక్ టాక్‌లో దీనికి సంబంధించిన పోస్ట్‌లతో ఫేమ‌స్ అయ్యాడు. తాను 2027 సంవ‌త్స‌రం నుంచి వ‌చ్చాన‌ని, తానే ఈ ప్ర‌పంచంలో చివ‌రి మ‌నిషిన‌ని చెప్పారు. త‌రువాత అత‌డు క‌నుమ‌రుగైపోయాడు. ఇప్పుడు అలాంటి పోస్ట్‌ల‌తో మ‌రో టిక్ టాక్ యూసర్ పాపులర్‌గా మారాడు. అత‌డేం చెబుతున్నాడంటే..‘ ఈ నెల 20వ తేదీన సూర్యుడి నుంచి మనుషులకు కొన్ని శక్తులు వస్తాయి. తరువాత ఐదు రోజులకు మనుషులు ఆశ్చర్యపోయే ఘటన ఒకటి జరుగుతుంది. ఇది మనుషులపై చాలా ప్రభావం చూపుతుంది. నేను మీ ముందు కాలం వాడిని. ఇది నిజం. నమ్మండి.’ అని అంటున్నాడు. ఈ ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ యూస‌ర్ భ‌విష్య‌త్తులో ఫ‌లానావి జ‌రుగుతాయంటూ కూడా ఆ పోస్ట్‌లో చెబుతున్నాడు. మ‌రి నిజంగానే టైం ట్రావెలింగ్ చేసిన వ్యక్తేనా ? నిజంగా అత‌డు మ‌న ముందు కాలం వాడేనా ? అత‌డు చెప్పేవ‌న్నీ జ‌రుగుతాయా ? సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ కావడానికే ఆ పోస్ట్ పెట్టాడా ? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటీ స‌మాధానం తెలియాలంటే మనం డిసెంబ‌ర్ 25వ తేదీ వ‌ర‌కు ఎదురుచూడాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios