పాములను వెళ్లగొట్టాలని ఇంటినే తగులబెట్టాడు.. మండుతున్న ఇంటి ఫొటోలు వైరల్

ఇంట్లోకి తరుచూ పాములు వస్తున్నాయని, వాటిని నిప్పు ద్వారా వేడి రగిలించి తద్వారా వచ్చే పొగతో వాటిని పారదోలాలని అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్ర నివాసి ఒకరు అనుకున్నారు. వేడి రగల్చడానికి బొగ్గులను ఎంచుకున్నాడు. కానీ, వాటిని పేలిపోయే ముప్పు ఉన్న సరుకుల పక్కన పెట్టాడు. దీంతో మంటలు తీవ్రంగా వ్యాపించి ఇల్లే నేలమట్టం అయింది. సుమారు 13.55 కోట్ల విలువైన ఇల్లు మంటల్లో కాలిపోయింది. 
 

man burned down house while trying to smoke out snakes

న్యూఢిల్లీ: ఇంట్లో(House) ఎలుకల బెడద ఉన్నదని ఇల్లును తగులబెట్టుకుంటారా ఎవరైనా? అనే మాట తరుచూ వింటుంటాం. ఎన్ని ఎలుకలు ఉన్న వాటిని ఎలా పంపించాలా అని ఆలోచిస్తాం కానీ.. ఉన్న ఇంటినే నాశనం చేసుకోం కదా అని ఆ సామెత అర్థం. అంటే సమస్యను పరిష్కరించుకోవాలని కానీ, మనల్ని మనమే నష్టపరుచుకుంటే ఎలా అని చెప్పడానికి దీన్ని వాడుతూ ఉంటారు. అమెరికాలోని అతనికి ఈ నానుడి తెలిసి ఉండకపోవచ్చు. ఇంట్లోని పాములు(Snakes) వెళ్లగొట్టాలని ప్రయత్నించిన ఆయన ఏకంగా ఇంటినే బూడిదపాలు చేశాడు. రూ. 13.55 కోట్ల ఆ ఇల్లు కాలిపోయి(burned) నేలకూలడం మీద   నెటిజన్లు చర్చ పెట్టారు.

Americaలోని మేరీలాండ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చుట్టుపక్కల పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఆ ఇంటిలో పాముల బెడద ఉన్నది. తరుచూ ఆ ఇంటికి పాములు రావడంపై ఆ ఇంటి యజమానికి చిరాకు తెప్పించింది. ఎలాగైనా వీటిని వెళ్లగొట్టాలని అనుకున్నాడు. ఇంట్లో ఉష్ణోగ్రతలు పెంచి అంటే వేడిమి పుట్టించి పొగ ద్వారా పాములను వెళ్లగొట్టాలని((Smoke Out)) భావించాడు. అందుకోసం బొగ్గును ఉపయోగించాలని అనుకున్నాడు. పొగను పుట్టించడానికి ఆయన బొగ్గను సేకరించుకున్నాడు.

Also Read: Viral: విమానంలో... పిల్లికి తన రొమ్ము పాలు పట్టిన మహిళ..!

అయితే, ఆ బొగ్గను పేలిపోయే ప్రమాదం ఉన్న వస్తువుల దగ్గర ఉంచి పెద్ద తప్పు చేశాడు. ఆ బొగ్గకు నిప్పు అంటించిన తర్వాత దానితో సమీపంలోని పేలిపోయే ముప్పు ఉండే వస్తువులు బ్లాస్ట్ అయ్యాయి. బొగ్గు ద్వారా ఏర్పడ్డ నిప్పు ఆయన నియంత్రణలో ఉన్నప్పటికీ ఈ వస్తువుల పేలుడు ఒక్కసారిగా పరిస్థితులను తారుమారు చేశాయి. ఆ తర్వాత ఆ ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి.

ముందు ఆ మంటలు బేస్‌మెంట్‌లో ఎక్కువయ్యాయి. ఆ తర్వాత వేగంగా ఇతర ఫ్లోర్‌లలోకీ వ్యాపించాయి. చివరికి వాటిని ఆర్పలేని పరిస్థితులకు చేరిపోయాయి. ఆ మంటలను చూస్తి యజమాని సిస్తేజంగా, నిస్సహాయుడై నిలిచిపోయాడు. అదృష్టవశాత్తు ఆ ఇంటిలో మరెవరూ చిక్కుకోలేదు. కాబట్టి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఈ ఇంటి నష్టం సుమారు రూ 7.52 కోట్ల వరకు ఉంటుందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఇటీవలే ఆ ఇంటిని రూ. 1.355 కోట్లు వెచ్చించి కొనుగోలు జరిపారని తెలిపింది.

Also Read: అలస్కా రాష్ట్రాన్ని అమెరికాకు రష్యా ఎందుకు అమ్మింది?

ఇల్లు తగలబడి పోతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఇంటిని తగులబెట్టడానికి గల కారణాలను ప్రస్తావించారు. కొందరు ఇతర సూచనలు చేస్తుంటే ఇంకొందరు జోకులు పేల్చారు. ఆ ఇల్లు ఎంత పాతదో ఎవరికైనా తెలుసా.. మా ఇల్లు పురాతనమైనది. మా ఇంటికీ పాములు వస్తాయి. ప్రతి ఏడాది నేను కచ్చితంగా పాములను పట్టి ఎక్కడో ఓ చోట వదిలిపెడుతుంటాను. ఇదే సురక్షితమైన పరిష్కారం అంటూ ఓ యూజర్ పేర్కొన్నాడు. మరొకరు పాములకు వకాల్తా పుచ్చుకుని మమ్ముల్ని ఒంటరిగా వదిలి పెట్టి ఉండాల్సింది అంటూ కామెంట్ చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios