పెద్దలు మా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు.. కనీసం మీరైనా మాకు పెళ్లి చేయండి అంటూ చాలా మంది ప్రేమ జంటలు పోలీస్ స్టేషన్ గొడప తొక్కుతున్నారు. తాజాగా... ఇదే రిక్వెస్ట్ తో ఓ ప్రేమ జంట పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. కానీ వాళ్లని చూసి... వాళ్ల ప్రేమ కథ విన్నాక పోలీసులకు దిమ్మతిరిగి పోయింది. ఇది కరెక్ట్ కాదని వాళ్లకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం  చేశారు. అయితే.. దానిని అర్థం చేసుకునే స్థితిలో కూడా వారు లేకపోవడం విశేషం. ఆ ప్రేమ జంటలో మహిళ వయసు 60కాగా... సదరు కుర్రాడి వయసు 22 కావడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆగ్రాకి చెందిన ఓ మహిళకు వివాహమైంది. ఏడుగురు సంతానం కూడా ఉన్నారు. వారి పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి.. వాళ్లకు కూడా పిల్లలు ఉన్నారు. మొత్తంగా ఆమెకు ఏడుగురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాటికి కాళ్లు  చాపుకొని.. కృష్ణా రామ అంటూ చదువుకోవాల్సిన వయసులో ఆమెకు ప్రేమ పుట్టుకువచ్చింది. భర్త బతికి ఉండగానే మరో వ్యక్తిపై మనసు పారేసుకుంది. అది కూడా మనవడి వయసులో ఉన్న ఓ కుర్రాడిపై కావడం గమనార్హం.

ఆ మహిళకు 60ఏళ్లు ఉండగా సదరు యువకుడికి 22ఏళ్లు కావడం గమనార్హం. వీరిద్దరూ ఒకరిని మరొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నారు. ఈ విషయం కాస్త ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్ద గొడవే జరిగింది. అయినా వాళ్లిద్దరూ మా ప్రేమ గొప్పదని... పెళ్లి చేసుకొని తీరతామని భీష్మించుకు కూర్చున్నారు.

Also Read ఇలాంటి తల్లులు కూడా ఉంటారా..? కూతురి భర్తతో కాపురం చేసి బిడ్డని కూడా.....

దీంతో సదరు మహిళ భర్త, ఆమె కుమారుడు పోలీసు స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పారు. దీంతో వీరిద్దరినీ సదరు యువకుడి కుటుంబాన్ని కూడా పోలీసులు అక్కడికి రప్పించారు. మహిళదే అంతా తప్పు అని యువకుడు కుటుంబీకులు ఆరోపించగా... లేదు..ఆ యువకుడిదే తప్పని వీళ్లు వాదించారు. వారి గొడవను సర్దిచెప్పిన పోలీసులు.. సదరు మహిళకు, ఆ యువకుడితో మాట్లాడారు.

Also Read పదిరోజుల్లో పెళ్లి... వధువు తల్లితో వరుడి తండ్రి లేచిపోయాడు....

మీ ప్రేమ కరెక్ట్ కాదని... ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే... వాళ్లు వినిపించుకోకపోవడం విశేషం. తమ ప్రేమ గొప్పదని.. కచ్చితంగా పెళ్లి చేసుకొని తీరతామని చెప్పారు. చేసేది లేక పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.