పదిరోజుల్లో పెళ్లి... వధువు తల్లితో వరుడి తండ్రి లేచిపోయాడు..

First Published 21, Jan 2020, 1:57 PM IST

రెండు కుటుంబాలకు పరిచయం ఉండటంతో వీరి పెళ్లికి త్వరగానే అంగీకరించారు. సంవత్సరం క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో పది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కానీ పెళ్లి ఆగిపోయింది.
 
ప్రేమ పెళ్లిళ్లను కాదనే పెద్దలను చాలా మందే చూసుంటారు. పెద్దలను ఎదురించి పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కూడా చూసి ఉంటారు. అదేవిధంగా పిల్లలను బెదిరించి ప్రేమికులను విడదీసిన పెద్దలు కూడా ఉంటారు.  చాలా కొద్ది మందికి మాత్రమే ఇరు కుటుంబాల మద్దతు దొరుకుతుంది.

ఈ దంపతులకు పెద్దల నుంచి మద్దతైతే దొరికింది కానీ.. పెళ్లి మాత్రం జరగలేదు. పెళ్లి కొడుకు తండ్రితో.. పెళ్లి కూతురు తల్లి లేచిపోయింది. దీంతో... పది రోజుల్లో జరగాల్సిన పెళ్లి కాస్త పెటాకులుగా మారింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూరత్ కి చెందిన ఓ యువ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఉండేది పక్కపక్క ఇళ్లల్లోనే. చిన్నప్పటి నుంచి ఒకరి గురించి మరొకరికి తెలుసు. చిన్ననాటి స్నేహమే పెద్దయ్యాక ప్రేమగా మారింది. వారి ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లడానికి వాళ్లు పెద్దగా కష్టపడింది లేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూరత్ కి చెందిన ఓ యువ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఉండేది పక్కపక్క ఇళ్లల్లోనే. చిన్నప్పటి నుంచి ఒకరి గురించి మరొకరికి తెలుసు. చిన్ననాటి స్నేహమే పెద్దయ్యాక ప్రేమగా మారింది. వారి ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లడానికి వాళ్లు పెద్దగా కష్టపడింది లేదు.

రెండు కుటుంబాలకు పరిచయం ఉండటంతో వీరి పెళ్లికి త్వరగానే అంగీకరించారు. సంవత్సరం క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో పది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కానీ పెళ్లి ఆగిపోయింది.

రెండు కుటుంబాలకు పరిచయం ఉండటంతో వీరి పెళ్లికి త్వరగానే అంగీకరించారు. సంవత్సరం క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో పది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కానీ పెళ్లి ఆగిపోయింది.

కారణం ఏమిటో తెలుసా... పెళ్లి కొడుకు తండ్రి.. పెళ్లి కూతురు తల్లి లేచి పోయారు. పిల్లలిద్దరూ పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కుడ మారిపోతాయో అనే భయంతో.. వాళ్లిద్దరూ ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. వారి ప్రేమ.. వీళ్ల ప్రేమను తుంచేసింది.

వాళ్లిద్దరూ కలిసి లేచిపోయారు అనే విషయం తెలుసుకోవడానికే వీళ్లకు చాలా రోజులే పట్టింది. పెళ్లి పనులు మొదలుపెట్టిన రోజు నుంచే ఇటు అబ్బాయి వాళ్ల తండ్రి.. అటు అమ్మాయి వాళ్ల అమ్మ కనిపించకుండా పోయారు.

వీళ్లు ఏమైపోయారా అని అంతా వెతికారు. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. వీళ్ల ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో వాళ్లిద్దరూ లేచిపోయారనే విషయం అర్థమయ్యింది.అంతేకాదు వాళ్ల ప్రేమ విషయం కూడా బయటపడింది.

పెళ్లికొడుకు తండ్రి రమేష్( పేర్లు మార్చాం).. పెళ్లి కూతురు తల్లి సరిత(పేర్లు మార్చాం) లకు యవ్వనదశలో ఉన్నప్పటి నుంచే పరిచం ఉందట. వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారట కూడా. అయితే.... కొన్ని కుదరక వాళ్ల ప్రేమ పెళ్లిదాకా రాలేదు.

ఇద్దరూ వేరేవాళ్లను పెళ్లి చేసుకున్నారు. కానీ... ఇళ్లు మాత్రం పక్కపక్కనే తీసుకున్నారట. ఇన్ని సంవత్సరాలుగా వాళ్లు పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ వచ్చారు. సడెన్ గా పిల్లలు ప్రేమ.. పెళ్లి అంటూ ముందుకు వచ్చి నిలబడటంతో ఏమిచెయ్యాలో అర్థం కాలేదు.

ముందు మాత్రం అనుమానం రాకుండా పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించారు. తీరా పెళ్లి తేదీ దగ్గరకు వచ్చి.. పెళ్లి పనులు మొదలుపెట్టేసరికి ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ లేచిపోయారు. వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇరు కుటుంబాలవారు ముక్కున వేలుసుకున్నారట.

ఇక ఆ అమ్మాయి, అబ్బాయి పరిస్థితైతే వర్ణనాతీతం. ఇప్పుడు వీళ్ల ప్రేమ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటం విశేషం.

loader