Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి తల్లులు కూడా ఉంటారా..? కూతురి భర్తతో కాపురం చేసి బిడ్డని కూడా...

లండన్ కి చెందిన లారెన్ వాల్ అనే మహిళలకు తండ్రి లేడు. తన తల్లి జూలీపౌల్ తో కలిసి ఉండేది. తన తల్లే ప్రాణంగా జీవించేది. లారెన్ వాల్ కి చిన్నప్పటి నుంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కల ఉండేది. ఆమె కలను తల్లి తీర్చింది దాదాపు రూ.14లక్షలు ఖర్చు చేసి 2004లో లారెన్ కి వివాహం జరిపించింది ఆమె తల్లి.
 
Daughter tells how she can never forgive mother after heart break at seeing her marry ex husband
Author
Hyderabad, First Published Jan 20, 2020, 9:03 AM IST

తల్లి తన బిడ్డను కడుపులో 9మాసలు మోస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఇక పుట్టింది ఆడపిల్ల అయితే... మరింత అల్లారుముద్దుగా పెంచుతుంది. ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని కలలు కంటుంది. ఏ తల్లినా.. తన కూతురి విషయంలో ఇలానే ఆలోచిస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం అలా ఆలోచించలేదు. కన్న కూతురి కాపురాన్నే కూల్చేసింది. కూతురి భర్తను తనవైపు తిప్పుకుంది. సంవత్సరం తిరిగేలాగా... కొడుకు లాంటి అల్లుడితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నది. ఈ దారుణ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.

Daughter tells how she can never forgive mother after heart break at seeing her marry ex husband

ఏ తల్లి తన కూతురికి చేయని ద్రోహం.. తనకు తన తల్లి చేసిందంటూ సదరు మహిళ తన ఆవేదనంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...

లండన్ కి చెందిన లారెన్ వాల్ అనే మహిళలకు తండ్రి లేడు. తన తల్లి జూలీపౌల్ తో కలిసి ఉండేది. తన తల్లే ప్రాణంగా జీవించేది. లారెన్ వాల్ కి చిన్నప్పటి నుంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కల ఉండేది. ఆమె కలను తల్లి తీర్చింది దాదాపు రూ.14లక్షలు ఖర్చు చేసి 2004లో లారెన్ కి వివాహం జరిపించింది ఆమె తల్లి.

Latest News పీరియడ్స్ అని చెప్పి దూరం పెట్టింది.. రెండు వారాల తర్వాత....

తన డ్రీమ్ వెడ్డింగ్ కోసం తల్లి అంత ఖర్చు చేయడంతో లారెన్ సంబరపడిపోయింది. జీవితాంతం తన తల్లిని తాను కష్టపెట్టకుండా ప్రేమగా చూసుకోవాలని అనుకుంది. ఈ ప్రేమతోనే భర్తతో తాను హనీమూన్ కి వెళ్తూ... ఒంటరిగా తన తల్లిని వదిలేసి వెళ్లలేక ఆమెను కూడా తీసుకువెళ్లింది.

Daughter tells how she can never forgive mother after heart break at seeing her marry ex husband

అదే ఆమె చేసిన పెద్ద తప్పు... కొత్తగా పెళ్లైన దంపతుల మధ్యలోకి లారెన్ తల్లి జూలీ వచ్చింది. కూతురికి తెలియకుండా ఆమె ఎప్పుడు అల్లుడికి దగ్గరైందో కూడా తెలీదు. తన తల్లి గర్భం దాల్చిందనే విషయం తెలిసేంతవరకు... లారెన్  వాళ్లిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని గుర్తించలేకపోయింది.

తీరా గర్భం దాల్చాక.. ఈ విషయం పై లారా తన తల్లిని నిలదీసింది. మొదట నిజం అంగీకరించని జూలీ.. తర్వాత ఒప్పుకుంది. 9 నెలల అనంతరం లారెన్ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మొదట్లో తల్లి... అల్లుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతూ వచ్చింది. అయితే అసలు విషయం తెలుసుకున్న లారెన్‌కు ఆ క్షణంలో కాళ్ల కింద భూమి కంపినట్లు అనిపించింది. 

Daughter tells how she can never forgive mother after heart break at seeing her marry ex husband

ఒక తల్లి కుమార్తె విషయంలో ఇలా చేయడాన్ని లారెన్ దిగమింగుకోలేకపోయింది. ఇటువంటి తల్లిని ఎప్పటికీ క్షమించలేనని లారెన్ పేర్కొంది. మనం ఎవరిమీదనైతే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటామో వారి వలనే మోసపోతామని లారెన్ గ్రహించింది. 

2004లో లారెన్‌కు వివాహం జరగగా, 2005లో లారెన్ తల్లి జూలీ పౌల్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 2009లో లారెన్ తల్లి జూలీ... లారెన్ భర్త పౌలీని వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి లారెన్ కూడా హాజరయ్యింది. తాను వివాహం చేసుకున్న వ్యక్తినే తల్లి కూడా వివాహం చేసుకోవడం లారెన్‌కు మింగుడుపడటం లేదు. 10 ఏళ్ల పాటు తనలోనే దాచుకున్న ఈ విషయాన్ని లారెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది.
 
Follow Us:
Download App:
  • android
  • ios