టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలపై దీక్ష చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ దీక్షకు అనుమతుల కోసం టిడిపి నాయకులు పోలీసులను కలిశారు.
విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపడుతున్నట్లు మాజీ మంత్రి
దేవినేని తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి కోసం ఇప్పటికే ఏర్పాట్లకు సిద్దమయ్యామని...ఇందుకోసం అధికారులను కలిసినట్లు తెలిపారు.
ప్రస్తుతం సీఎం జగన్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలే జరగలేవని ఆయన మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అలాగయితే నిన్న(బుధవారం) ఐదుగురు కార్మికులకు ఐదు లక్షలు ఎలా ఇచ్చారని ఉమ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిమెంట్ కంపెనీల దగ్గర ముడుపుల కోసమే ప్రస్తుతం ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని ఆరోపించారు. ఒక్క సిమెంట్ బస్తా మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా సంచలన ఆరోపణలు చేశారు.
read more ఇసుక ధరను నిర్ణయించే అధికారం వారికే... హద్దుదాటితే జైలే...: జగన్
జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇందిరా గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ దీక్షకు అన్ని పక్షాల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. గతంలో ఒక్కటిగా వున్న తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులు వరదలు వచ్చాయని అవగాహన లేకుండా మాట్లాడటం తగదన్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని... వారి వల్లే ఈ ఇసుక కొరత ఏర్పడుతోందన్నారు.
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ఇసుక దోపిడీ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. అలాగే అమరావతి శిలా పలకం పై తెలుగు లేదని యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం లోకి మార్చుతూమంటూ జీవో 81 తీసుకు వచ్చారని...ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయం కాదా అని ప్రశ్నించారు.ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.
read more ఇసుక కొరత: తెనాలిలో మరో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య
మాతృ బాషను ఎందుకు విస్మరించారో సీఎం జగన్, లక్ష్మి పార్వతి, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సమాధానం చెప్పాలి అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉమ డిమాండ్ చేశారు.
ఇక టిడిపి మాజీ ఎమ్యెల్యే బోండా ఉమ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉచితంగా ఇసుక ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని మంత్రులు ,ఎమ్మెల్యేలు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేసినా ప్రభుత్వం లో కదలిక లేదన్నారు. ఇసుక కొరత నిరసిస్తూ ఈ నెల 14 న చంద్రబాబు నిరసన దీక్ష చేపడుతున్నారని అన్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి కోసం అధికారులను కలిశామని.జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి అక్కడ దీక్ష చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని ఉమ సూచించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 7, 2019, 5:58 PM IST