ఇసుక ధరను నిర్ణయించే అధికారం వారికే... హద్దుదాటితే జైలే...: జగన్
అమరావతి వేదికన జరిగిన రివ్యూ మీటింగ్ లో సీఎం జగన్ అధికారులతో ఇసుక మాఫియా, స్మగ్లింగ్ పై చర్చించారు. వీటిపై ఉక్కుపాదం మోాపి రాష్ట్రంనుండి తరిమి కొట్టాలని సీఎం సంబంధిత అధికారులు, పోలీస్ శాఖకు ఆదేశించారు.
అమరావతి: ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ రెండు అంశాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సీఎం కేవలం వీటిపై చర్చించేందుకే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సీనియర్ పోలీసు అధికారులు రవిశంకర్ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు తదితరులు పాల్గోన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వారికి కీలక ఆదేశాలు జారీచేశారు.
ముఖ్యంగా ఇసుక ధరలకు కళ్లెం వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను కూడా సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లను ఆదేశించాలని గనులశాఖ అధికారులకు సూచించారు. ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలన్నారు. ఏ జిల్లా, ఏ నియోజకవర్గాల్లో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
read more ఎమ్మెల్యే ఆర్కే వెంటనే రాజీనామా చేయాలి...: లోకేశ్ డిమాండ్
రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలని... నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలన్నారు. నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలని... ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలని సూచించారు. ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా పెట్టాలని సూచించారు.
ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుని జైలుకు పంపాలన్నారు. ఒక్క రవ్వకూడా అవినీతికి తావులేకుండా చేస్తున్నామని... అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నామని సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారని...అయినా సరే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించాలని ఆదేశించారు. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తామన్నారు. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తామని తెలిపారు.
రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మగ్లింగ్ చేయకూడదరని... టెక్నాలజీని వాడుకోని దీన్ని నివారించాలన్నారు. స్మగ్లింగ్ జరిగితే చెడ్డపేరు వస్తుందన్నారు. చెక్‌పోస్టుల్లో టీంలు, మొబైల్ టీంలను పెంచుతామని అధికారులు సీఎం తెలిపారు. ప్రత్యేక టీంలను కూడా పెంచుతామన్న అధికారులు
తెలిపారు.
read more బదిలీ ఎఫెక్ట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం
చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైడ్స్ చేయాలి... కేసులు పెట్టాలి... తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలన్నారు. ఇది జరిగితే ఖచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.
ప్రస్తుతం ఇసుక లభ్యతపై అధికారుల నుంచి సీఎం వివరాలు సేకరించారు. 275 రీచ్‌ల్లో 83 చోట్ల రీచ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు తెలిపారు. దీంతో రోజుకు సరఫరా 41వేల మెట్రిక్ టన్నుల నుంచి 69 వేల మెట్రిక్ టన్నులు పెరిగిందన్నారు. వారంరోజుల్లో లక్ష మెట్రిక్ టన్నులకు సరఫరా పెరుగుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.
వాతావరణం ఇలాగే సహకరిస్తే... 15–30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు సీఎం కు విన్నవించారు. వాతావరణం సహకరించిన వెంటనే 275 రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభిస్తామని...దీంతో రోజుకు 2–3 లక్షల టన్నుల వరకూ ఇసుకను సరఫరా చేయగలుగుతామన్నారు.
మొత్తం రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అని అధికారులను సీఎం ప్రశ్నించారు. 275 రీచ్‌ల్లో ఏం జరుగుతుందనేది ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. దీంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
read more సొంత జిల్లాలో చంద్రబాబు బిజీబిజీ... మూడు రోజుల షెడ్యూల్ ఇదే
వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలని సూచించారు. ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలని..కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు. ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.