ఇసుక కొరత: తెనాలిలో మరో భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని నందివెలుగు గ్రామంలో బుధవారం మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని నందివెలుగు గ్రామంలో బుధవారం మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామానికి చెందిన కట్టా శ్రీనివాసరావు తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇసుక కొరత కారణంగా ఐదు నెలల నుంచి పనులు లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
దీంతో మనస్తాపానికి చెందిన శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Also Read:video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్
కాగా కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకే చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన సెల్ ఫోన్ లో సెల్పీ వీడియో తీసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గుంటూరుకు చెందిన పోలెపల్లి వెంకటేశ్ ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల నెలకొన్న ఇసుక కొరతతో అతడికి గతకొంతకాలంగా పని దొరకడం లేదు. దీంతో కుటుంబాన్ని పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు.
అయితే ఇప్పటికే పని దొరక్క తీవ్ర ఒత్తిడిలో వున్న అతడికి ఆర్థిక కష్టాలు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో ఇక బ్రతకడం భారంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు కొద్దిసేపటి ముందు తన సెల్ ఫోన్ లో ఓ సెల్పీ వీడియోను తీసుకున్నాడు. అందులో తన ఆత్మహత్యకు కారణాలను వివరించడంతో పాటు తన గుండెల్లో దాగున్న బాధనంతా బయటపెట్టాడు. కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు.
Also read:వరదల్లో ఏపి ఇసుక హైదరాబాద్ కు కొట్టుకుపోతోందా...?: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సెటైర్లు
ఈ ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్మికుడు ఆత్మహత్య తర్వాత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదే జిల్లాలో గతంలో ఇదే సమస్యకు ఓ తాపీమేస్త్రీని బలయ్యాడు. గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
దీంతో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.