నన్నెవరూ బతికించొద్దు.. అంటూ లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా కార్యకర్త..

విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సాక్షిగా ఓ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 

Share this Video

విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సాక్షిగా ఓ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సోమవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ సిపి కార్యకర్త బోల్లి పల్లి జోనికుమారి పార్టీలోని కొంతమంది తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిమీద జగన్ ను కలిసి ఫిర్యాదు చేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కరోనా కారణంగా కలవలేకపోయానంది. ఈనెల ఆరో తేదీన ఎం.పి.విజయసాయిరెడ్డిని కలిసి, తన సమస్య వివరించినా న్యాయం జరగలేదని, ముఖ్యమంత్రికి ఈమెయిల్, ట్విట్టర్ ద్వారా తెలిపానని అయినా ఎవ్వరూ స్పందించలేదని చెప్పారు. చెబుతూనే ఆకస్మాత్తుగా నన్నెవరూ బతికించొద్దు అంటూ విషం బాటిల్ తీసి తాగేసింది. వెంటనే విషయం తెలుసుకన్న త్రీ టౌన్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Related Video