Video: అన్నదాత వద్ద లంచం డిమాండ్... అడ్డంగా బుక్కయిన రెవెన్యూ అధికారి
రైతుల నుండి భారీ లంచాలను వసూలు చేస్తున్న కృష్టా జిల్లా తిరువూరు మండలానికి చెందిన ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఏసిబి వలలో చిక్కాడు.
విజయవాడ: తిరువూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. 16 వేలు లంచం తీసుకుంటూ సదరు అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి అధికారులకు చిక్కాడు.
తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి అనే రైతు తనకు చెందిన నాలుగెకరాల భూమిని భార్య మరియు కుమార్తె ల పేరుపైకి బదలాయించాలనున్నాడు. ఈ క్రమంలోనే సాదా భైనమా మరియు పట్టదారు పాస్ పుస్తకాల కొరకుఈ నెల ఆరవ తేదీన గ్రామ రెవెన్యూ అధికారి పోతురాజు జయకృష్ణ ను కలిసి అర్జీ సమర్పించుకున్నాడ. అయితే ఈ పత్రాలు కావాలంటే 20వేలు లంచం ఇవ్వాలంటూ వీఆర్వో డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని చంద్రమౌళి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచగొండి ఎమ్మార్వో బండారం బయటపడింది.