Video news :100కి ఫోన్ చేస్తే దిశాను కాపాడేవారనడం హాస్యాస్పదం...
మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దర్నా చౌక్ లో సిపిఎం దర్నా చేపట్టింది. సిపిఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ నిర్బయ ఘటన జరిగి ఏడేళ్ళయినాచర్యలు లేవని, విఐపి లకు, మంత్రులకే పోలీస్ వ్యవస్ధ సరిపోతుందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో, మహిళలపై అత్యాచారాలు జరిగితే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నాయన్నారు.

మహిళలపై అఘాయిత్యాలు చేసేవారు అత్యధికమంది రాజకీయ నాయకులే ఉంటున్నారన్నారు. 100 కి ఫోన్ చేస్తే దిశాను కాపాడేవారని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్నిసార్లు 100 కి కాల్ చేస్తే చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.