video: ఏపి పోలీసులు అప్రమత్తం... మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

విజయవాడ: హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఉదంతం యావత్ దేశాన్ని  కలిచివేసిందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసిపి సురేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా రక్షణకు ఏపి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

First Published Dec 1, 2019, 7:29 PM IST | Last Updated Dec 1, 2019, 7:29 PM IST

విజయవాడ: హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఉదంతం యావత్ దేశాన్ని  కలిచివేసిందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసిపి సురేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా రక్షణకు ఏపి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 100 డయల్ చేస్తే రక్షక్ , బ్లూక్లోట్స్ సిబ్బంది ఐదు నిమిషాల్లో  గమ్యస్థానాలకు చేరి ఆపదలో ఉన్నవారికి రక్షణ కల్పిస్తారని చెప్పారు. మొబైల్ ఫోను పవర్ బటన్, 5  నెంబర్ బటన్  పట్టుకుని ప్రెస్ చేస్తే పోలీసు కంట్రోల్ రూమ్ కి సమాచారం వెళ్తుందని... మహిళా లోకానికి రక్షణగా నిలుస్తారన్నారు. ఇది ఆపదలో ఉన్న మహిళలకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. పోలీసు శాఖ ఎప్పుడు మహిళ రక్షణ కల్పించేందుకు ముందుంటుందని ఏసిపి తెలిపారు.