బెజవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం.. దళిత జేఏసీ నిరసన దీక్షలు..

అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. 

First Published Jul 8, 2020, 12:02 PM IST | Last Updated Jul 8, 2020, 12:02 PM IST

అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. శాఖమూరులోని అంబేద్కర్‌ స్మృతివనం ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మాణం కోసం ఇప్పటికే 1,500 టన్నుల ఐరన్‌ వాడారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం స్మృతివనాన్ని తొలుత గుంటూరుకు మార్చుతున్నట్టు, ఆ తర్వాత విజయవాడకు మారుస్తున్నట్లు పలు ప్రకటనలు చేస్తోందన్నారు. అమరావతిలోనే అంబేద్కర్‌ స్మృతివనం ఉండాలని, లేదంటే తాము తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. వెంటనే రాజధాని అమరావతిలోనే అంబేద్కర్‌ స్మృతివనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.